ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సమీర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.శ్రీరామదాసు సినిమాలో లక్ష్మణుడు పాత్ర పోషించడానికి చాలా కష్టపడ్డానని ఆయన తెలిపారు.
ఆ పాత్రను నేను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.తాను అంతకుముందు శివుడి పాత్రలో నటించడంతో లక్ష్మణుడి పాత్రకు పని చేసే ఛాన్స్ దక్కిందని ఆయన తెలిపారు.
ఆ సమయంలో నాన్ వెజ్ కు దూరంగా ఉంటూ కింద పడుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.శ్రీరామరాజ్యం సినిమా చేసే సమయంలో కూడా నేను అవే నియమాలను పాటించానని ఆయన తెలిపారు.
శ్రీరామరాజ్యం సమయంలో క్లోజప్ షాట్ ఉందని నాకు చెప్పలేదని అలా జరగడంతో నేను ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.బాపుగారు నా మాటకు వాల్యూ ఇవ్వాలి కదా అని అన్నారని ఆయన తెలిపారు.
బాపుగారు తిట్టకుండా పక్కకు పిలిచి ఈ విషయాలు చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.మేము ఈ మతం ఆ మతం అని పట్టించుకోమని సమీర్ వెల్లడించారు.
నా లైఫ్ లో వన్ సైడ్ లవ్ లే ఎక్కువ అని ఆయన తెలిపారు.నా భార్య పేరు అపర్ణ అని ఆయన అన్నారు.
మా మిసెస్ ఎప్పుడూ నువ్వు ప్రేమిస్తావు కానీ ఎక్స్ ప్రెస్ చేయవు అని అన్నారని ఆయన కామెంట్లు చేశారు.
మొదటి బాబు పుట్టే సమయంలో ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి 7 నెలలకు బిడ్డను తీసెయ్యాలని డాక్టర్లు చెప్పారని నా భార్య అస్సలు ఒప్పుకోలేదని సమీర్ చెప్పుకొచ్చారు.నా భార్య ధైర్యానికి హ్యాట్సాఫ్ అని సమీర్ కామెంట్లు చేశారు.అమ్మమ్మ దగ్గర నేను పెరిగానని అమ్మమ్మ చనిపోయారనే వార్త తెలిసి ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.