టీనేజ్ ప్రారంభం అయ్యిందంటే చాలు మొటిమలు పనిగట్టుకుని మరీ వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి.పైగా మొటిమల వల్ల కొందరికి మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి.
మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ముఖ సౌందర్యాన్ని మాత్రమే కాదు మనోధైర్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి.ఈ నేపథ్యంలోనే మొటిమలు, వాటి తాలూకు మచ్చలను వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.
మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మ్యాజికల్ సీరం ను కనుక వాడితే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఇట్టే మాయమవుతాయి.పైగా ఈ సీరం ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ను పోసుకోవాలి.
వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ ను వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకొని చల్లార బెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో ఆరు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్లు ములేటి వాటర్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుంటే మన మ్యాజికల్ సీరం సిద్ధం అవుతుంది.
ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ముఖానికి మేకప్ ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న సీరంను చర్మానికి అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ సీరంను వాడితే కనుక మొటిమలు, వాటి తాలూకు మచ్చలు చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.
మరియు ఈ సీరం ను వాడటం వల్ల ముఖ చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయమవుతాయి.స్కిన్ టైట్ గా, బ్రైట్ గా సైతం మారుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.