చిక్కుల్లో నటుడు మోహన్ లాల్.. నోటీసులు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు!

మలయాళ నటుడు మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు.మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.

 Ed Takes Custody Of Malayalam Superstar Mohanlal In Money Laundering,monson Mavu-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు.పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్‌ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే అధికారులు వచ్చేవారం మోహన్ లాల్ కొచ్చి ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే అధికారులు ఈయనని మనీలాండరింగ్ విషయంపై ప్రశ్నించనునట్లు తెలుస్తోంది.

కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ గత కొన్ని సంవత్సరాలుగా పురాతన వస్తు వ్యాపారం చేస్తూ పది కోట్ల రూపాయల వరకు మోసం చేశారని వార్తలు రావడంతో ఆయన గత ఏడాది సెప్టెంబర్ నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే మోహన్ లాల్ తన ఇంటికి వెళ్లడంతో అధికారులు ఈయనకి కూడా నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

Telugu Officials, Janatha Garage, Kollywood, Mohanlal-Movie

మాన్సన్ మాన్కల్ దగ్గర టిప్పు సుల్తాన్‌ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, వంటి ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి.ఈ క్రమంలోనే ఈ వ్యాపారాలలో భాగంగా పెద్ద ఎత్తున వీరు మోసాలకు పాల్పడినట్లు తెలియడంతో మోహన్ లాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌  అధికారులు నోటీసులు జారీ చేశారు.ఇకపోతే మోహన్ లాల్ జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగులో విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube