చిక్కుల్లో నటుడు మోహన్ లాల్.. నోటీసులు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు!

మలయాళ నటుడు మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు.మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు.పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్‌ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే అధికారులు వచ్చేవారం మోహన్ లాల్ కొచ్చి ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే అధికారులు ఈయనని మనీలాండరింగ్ విషయంపై ప్రశ్నించనునట్లు తెలుస్తోంది.కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ గత కొన్ని సంవత్సరాలుగా పురాతన వస్తు వ్యాపారం చేస్తూ పది కోట్ల రూపాయల వరకు మోసం చేశారని వార్తలు రావడంతో ఆయన గత ఏడాది సెప్టెంబర్ నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే మోహన్ లాల్ తన ఇంటికి వెళ్లడంతో అధికారులు ఈయనకి కూడా నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

"""/"/ మాన్సన్ మాన్కల్ దగ్గర టిప్పు సుల్తాన్‌ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, వంటి ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఈ వ్యాపారాలలో భాగంగా పెద్ద ఎత్తున వీరు మోసాలకు పాల్పడినట్లు తెలియడంతో మోహన్ లాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌  అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇకపోతే మోహన్ లాల్ జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగులో విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

ఐఐటీలో సీటు సాధించిన గిరిజన బిడ్డ నవ్య.. ఈమె సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!