నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ దయా.( Dayaa ) ఈ వెబ్ సిరీస్ ఈ నెల 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించారు.ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావడానికి మరికొన్ని గంటలు సమయం ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
ఇందులో భాగంగానే తాజాగా నటుడు జేడీ చక్రవర్తి( JD Chakravarthy ) మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు.
ఈ సందర్బంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.
నేను కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని.
దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని( Pavan Sadhineni ) చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది.అందుకే ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఒప్పుకున్నాను.
కథ మనకున్న స్థలం లాంటిదైతే అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది.సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ పై ఆధారపడి ఉంటుంది.
హాట్ స్టార్( Hotstar ) నుంచి దయా వెబ్ సిరీస్ కోసం నన్ను తరుచూ సంప్రదించారు.నేను వెబ్ సిరీస్ చేసే మూడ్‌లో లేననుకుంటా డెసిషన్ చెప్పడం పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను.
వాళ్లు మాత్రం వదలలేదు.సినాప్సిస్ వినండి అని స్క్రిప్ట్ పంపారు.
ఆ తర్వాత డైరెక్టర్ పవన్ సాధినేని ఫోన్‌లో పది నిమిషాలు కథ వినిపించాడు.
పర్సనల్‌గా వచ్చి ఫుల్ స్క్రిప్ట్ చెప్తా అని వచ్చాడు.నేను స్టోరీ వినకుండానే దయా వెబ్ సిరీస్ చేస్తున్నా అని చెప్పాను.ఎందుకంటే నాకు గతంలో ఆర్జీవీ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి.
ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ( Ram Gopal Varma ) అనేవారు.పవన్ ఫోన్‌లో 10 నిమిషాలు స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది.
దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను.అలా ఆ సమయంలో నాకు గతంలో ఆర్జీవి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
ఆ విషయంలో నేను ఆర్జీవీని ఆయన మాటలను ఫాలో అవుతున్నాను అని తెలిపారు జేడీ చక్రవర్తి. ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది.నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి.నా మొదటి సినిమా శివ సినిమాతోనే నేను జేడీ అయిపోయాను.అలాగే బాహుబలి మూవీలో సత్యరాజ్‌ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాము.ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా.
లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది.తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు చక్రవర్తి.