ఇలియానాకు యాక్టింగ్ నేర్పించడానికి ఏకంగా అన్ని నెలలు పట్టిందట.. ఆమె ట్రైనింగ్ కు అన్ని లక్షలంటూ?

స్టార్ హీరోయిన్ ఇలియానా( Ileana ) టాలీవుడ్ సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.2006 సంవత్సరంలో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ కెరీర్ ను కొనసాగించడం అంటే సులువైన విషయం కాదు.నటుడు భిక్షు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలకు నటనలో శిక్షణ ఇచ్చారు.

 Actor Bhikshu Shocking Comments About Ileana Details Here Goes Viral In Sociall-TeluguStop.com

ఇలియానా, సుహాసిని, దీక్షా సేత్, పార్వతి మెల్టన్ మరి కొందరు హీరోయిన్లకు నేను యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చానని ఆయన తెలిపారు.

రామ్, ఇలియానాలకు ఒకే సమయంలో శిక్షణ ఇచ్చానని భిక్షు అన్నారు.బర్ఫీ సినిమాలో ( Barfi movie )ఇలియానా బాగా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.నటించే వాళ్లకు సైకాలజికల్ ఎనర్జీ ఉండాలని నేను చెబుతానని భిక్షు చెప్పుకొచ్చారు.

నాకు కోపం అస్సలు రాదని ఆయన తెలిపారు.మొదట ఫ్రెండ్ అయిపోయి ట్రైనింగ్ ఇస్తానని ఆయన కామెంట్లు చేశారు.అర్థం చేసుకోవా అని అంటానని ఆయన తెలిపారు.

ఇలియానాకు యాక్టింగ్ నేర్పించడం కష్టం అని అనిపించిందని భిక్షు అన్నారు.ఆమె ఇంగ్లీష్ వెరైటీగా ఉంటుందని భిక్షు వెల్లడించారు.

ఇలియానాకు శిక్షణ ఇవ్వడానికి 9 నుంచి 10 నెలలు పట్టిందని భిక్షు చెప్పుకొచ్చారు.

ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్( Sumanth Ashwin ) కు శిక్షణ ఇచ్చానని భిక్షు వెల్లడించారు.ఆయన డబ్బులు ఎగ్గొట్టాడని భిక్షు పేర్కొన్నారు.యాక్టింగ్ ట్రైనింగ్ కావాలంటే 4 నుంచి 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని భిక్షు తెలిపారు.

మూడు నెలలు నాలుగు నెలలలో కూడా ట్రైనింగ్ పూర్తవుతుందని ఆయన అన్నారు.ఇలియానా ట్రైనింగ్ కు 6 లక్షలు, రామ్ ట్రైనింగ్ కు 5 లక్షలు ఇచ్చారని భిక్షు తెలిపారు.

భిక్షు చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube