ప్రస్తుతం బీజేపీ ( BJP ) పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోయింది.ఇక ఒక రెండు మూడు సీట్లు తప్ప తెలంగాణ ఎన్నికల్లో ఈసారి బిజెపి వచ్చేలా లేదు.
అయితే ఈ పార్టీని నమ్ముకొని ఈటెల రాజేందర్ ( Etela Rajender ) ఒంటరి వాడైపోయాడు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ముందు నుండి కీలక నేత గా పనిచేసిన ఈటల రాజేందర్ ఎన్నో అవమానాలను ఛీత్కారాలను దిగమింగుకొని అందులో నిలబడ్డారు.
కానీ ఆ అవమానాలు ఎక్కువ అవడంతో ఈటెల రాజేందర్ పార్టీని వీడి అప్పుడు మంచి జోరు మీదున్న బిజెపిలోకి వచ్చారు.

కానీ ప్రస్తుతం బిజెపి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఇక బీఆర్ఎస్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఎదిగింది.అయితే కాంగ్రెస్ వాళ్లు ఎన్ని ఆఫర్లు చేసినా కూడా బిజెపిని వదిలి ఆయన కాంగ్రెస్ కి వెళ్లలేదు.
అయితే బిజెపిలో ఈటెల రాజేందర్ వచ్చినప్పటినుండి చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, బండి వర్గీయులకు ఈటల వర్గీయులకి అస్సలు పడడం లేదని, అలాగే ఈటెల వచ్చినప్పటి నుండి పార్టీలో ఉన్న చాలామంది కీలక నేతలు ఒక్కొక్కరిగా బయటికి వెళ్లిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈటెలకు పార్టీలో అంతగా సముచిత స్థానం ఇవ్వడం లేదని ఆయనను నమ్ముకొని వచ్చిన తుల ఉమా, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వాళ్ళే అందుకు సాక్ష్యం అని తెలుస్తోంది.
ఎందుకంటే తుల ఉమ ( Thula Uma ) కి వేములవాడ టికెట్ ఇస్తారని ఈటెల,ఉమా ఇద్దరు భావించారు.కానీ అనూహ్యంగా అక్కడ విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ కి టికెట్ కేటాయించారు.
ఇలా చివరి నిమిషంలో మోసం చేశారు.

దాంతో తుల ఉమా పార్టీకి రాజీనామా చేసింది.అలాగే ఏనుగు రవీందర్ రెడ్డి ( Enugu Ravinder reddy ) సైతం ఈటెల ఎక్కడుంటే అక్కడే ఉండేవారు.కానీ ఈయన కూడా ఈ మధ్యకాలంలో బిజెపికి గుడ్ బై చెప్పి పార్టీని వీడారు.
ఇలా బిజెపి పార్టీ తనని తక్కువ చూపు చూస్తుందని,పార్టీలో ప్రస్తుతం ఆయన అనుసరులైన తుల ఉమా, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వాళ్ళు పార్టీని వీడడంతో ఈటెల ఒంటరి వాడయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







