ఈ మధ్యకాలంలో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా, అలాగే ఈ టెక్నాలజీ కారణంగా ఆలస్యంగా భోజనం చేస్తున్నారు.ఇక ఇలా ఆలస్యంగా భోజనం చేయడం వలన చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.
ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే మరింత హానికరం.శరీర బరువు అనేది తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది.
అందుకే ఎంత తింటున్నాము? ఏం తింటున్నాము? ఏ సమయంలో తింటున్నాము.అన్నదానిపై శ్రద్ధ ఉండాలి.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వలన బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.రోజులో చివరి భోజనం ఏ సమయంలో తింటారు అన్నదానికి బరువు పెరగడానికి మధ్య లింక్ ఉంటుంది.

అయితే ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు ఒక అధ్యాయాన్ని నిర్వహించారు.దీంతో బరువు పెరగడానికి మధ్య రాత్రి భోజనం చేయడానికి, బరువు పెరగడానికి మధ్య లింక్ ఉందని శాస్త్రవేత్తలు రుజువులు చూపించారు.16 మందిని ఈ అధ్యాయానికి ఎంచుకొని వాళ్లను రెండు గ్రూపులుగా చేసి సిక్స్ డే టెస్టులు చేశారు.ఇక వారు ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం లాంటి విషయాల్లో చాలా కఠినంగా నియంత్రించారు.
మూడు రోజులు ఇక ఆ గ్రూపులో వారికి రోజుకు మూడుసార్లు భోజనం ఇచ్చారు.ఇక ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 1 గంటలకు భోజనం, సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం ఇచ్చారు.
మరో గ్రూపులో వారికి 1 కి అల్పాహారం, 6 గంటలకు రాత్రి భోజనం, 9 గంటలకు మరోసారి భోజనం ఇచ్చారు.

ఆ తర్వాత రక్తపరీక్ష( Blood test ) ద్వారా కడుపు నిండగా ఉన్నప్పుడు శరీరంలో ఉండే హార్మోన్ స్థాయిలను పరీక్షించారు.అయితే ఇవి రెండో గ్రూప్లో 24 గంటల పాటు తక్కువే ఉన్నట్టు తేలింది.అయితే ఈ హార్మోన్ శరీరంలో తక్కువగా ఉంటే తినే ఆస్కారం ఉంటుంది.
అలాగే క్యాలరీలు కూడా చాలా నెమ్మదిగా ఖర్చవుతాయి.ఇక సమయం దాటిన తర్వాత భోజనం చేయడం వలన ఎక్కువ కొవ్వు నిల్వ( Belly Fat ) ఉంటుంది అని ఈ పరిశోధనలో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా కొవ్వును విచ్చిన్నం చేసే లిపోసిస్( liposys ) కూడా నెమ్మందించినట్టు గుర్తించారు.అలాగే భోజనం చేసే సమయాలు మారినందువలన శరీర బరువు పెరుగుతారని అలాగే రకరకాల అనారోగ్యాలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరించారు.