తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడ్డుకోవాలని కోరారు.
దళితులకు మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులు, గిరిజనులకు రక్షణ కరువైందని బండి సంజయ్ ఆరోపించారు.
అసైన్డ్ భూముల్లో రియల్ దందాను అడ్డుకోకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని బండి సంజయ్ లేఖలో హెచ్చరించారు.







