వేసవికాలం( Summer Season ) కొనసాగుతున్నప్పటినుంచి ఎండలు బాగా మండిపోతున్నాయి.ఈ సీజన్లో మండుతున్న ఎండలు, మండే వేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు చాలామంది ఎక్కువగా కూల్ డ్రింక్ తాగడానికి ఇష్టపడుతున్నారు.
అలాగే ప్రజలు హైడ్రేటెడ్ గా ఎనర్జిటిక్ గా ఉండడానికి ఎన్నో పద్ధతులను ఉపయోగిస్తున్నారు.అయితే వేసవికాలంలో జ్యూస్, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం లాంటిది ఆరోగ్యకరమైన పానీయాలుగా డిమాండ్ పెరుగుతుంది.
అదే విధంగా ఈ జ్యూస్ కూడా చాలా మేలు చేస్తుంది.పుదీనా( Mint ) అలాగే నిమ్మకాయతో చేసిన షర్బతు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
ఇది వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

ఈ ఎండల వేడి నుండి ఉపశమనం లభించేందుకు నిమ్మకాయ( Lemon ), పుదినా చాలా బాగా ఉపయోగపడతాయి.నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
దీన్ని తాగడం వలన మీరు శరీరాన్ని మండే వేడిలో కూడా చల్లగా ఉంచుకోవచ్చు.అయితే దీనిని తయారు చేసుకోవడానికి పుదీనా, నిమ్మకాయలను ఉపయోగించాలి.
అయితే నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.పుదీనా, నిమ్మకాయ షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఆకులు, నిమ్మకాయ, పంచదార, జీలకర్ర పొడి, ఐస్ క్యూబ్స్, నీరు.

పుదీనా, నీంబు షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా పుదీనా తీసుకుని శుభ్రమైన నీటిలో ఆకులను బాగా కడగాలి.ఆ తర్వాత ఒక గిన్నెలో పుదీనా ఆకులను పక్కన పెట్టుకోవాలి.నిమ్మకాయ రసాన్ని తీయాలి.ఆ తర్వాత మిక్సీలో పుదీనా ఆకులు, నిమ్మరసం, పంచదార నీటిని కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి.ఇక జీలకర్ర పొడి( Cumin Powder )కూడా వెయ్యాలి.ఆ తర్వాత ఆ సిరప్ ను ఫిల్టర్ చేసి నాలుగు గ్లాసుల్లో సమాన పరిమాణంలో వేసుకొని తాగేముందు ఒక్కొక్కటి ఐస్ క్యూబ్ వేసుకుని చల్లచల్లగా తాగితే చాలా అద్భుతమైన రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.