Abhinav Gomatam : సనాతన ధర్మం గురించి అలాంటి ట్వీట్ చేసిన అభినవ్ గోమటం.. పవన్ కళ్యాణ్ వీడియో షేర్ చేస్తూ?

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కు నటుడు అభినవ్ గోమటం( Abhinav gomatam ) సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

 Actor Abhinav Gomatam Says Thanks To Pawan Kalyan For His Speech On Sanatana Dh-TeluguStop.com

ఇంతకీ అభినవ్ పవన్ కి ఎందుకు థాంక్స్ చెప్పాడు అన్న వివరాల్లోకి వెళితే.ఇటీవల తమిళనాడు మంత్రి నటుడు ఉదయినిది స్టాలిన్( Udhayanidhi Stalin ) సనాతన ధర్మం గురించి వివాదాస్పద వాఖ్యలు చేయడంతో అతనిపై ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో మండి పడటంతో పాటు ఈ విషయం దేశవ్యాప్తంగా పెద్దదిమారం రేపింది.

సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలను హిందువులు, హిందూ వాదులు వ్యతిరేకించారు. ఉదయనిధి స్టాలిన్‌పై >( Udhayanidhi Stalin )పలు చోట్ల కేసులు కూడా పెట్టారు.అయితే, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో సనాతన ధర్మానికి సపోర్ట్‌గా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యాయి.

సినీ ప్రముఖులు ఒకప్పుడు సనాతన ధర్మ గురించి మాట్లాడిన వీడియోలు, చేసిన ట్వీట్లను తాజాగా కొందరు వైరల్ చేశారు.కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ఆ వీడియోలో పవన్ మాట్లాడుతూ.దయచేసి సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టకండి.

హిందూ దేవతలను దూషణ చేయకండి అని పవన్ సూచించారు.

కొందరు సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను దూషిస్తున్నారని ఇది మానుకోవాలని పవన్ తెలిపారు.శబరిమల ఆలయం విషయంలో కానీ, సరస్వతీ దేవి మీద కానీ దూషణకు దిగిన పెద్దలందరికీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.దూషించొద్దని విన్నవించారు.

ఇలా ఎవరైనా దూషిస్తే అది బ్రాహ్మణ సమాజానికే బాధ కలిగిస్తుంది అనుకోవడం తప్పని. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందువుకి బాధ కలుగుతుందన్నారు.

మహమ్మద్ ప్రవక్తను అనడానికి మీకు భయమేస్తుంది.జీసస్ మహానుభావుడిని అనడానికి భయమేస్తుంది.

కానీ హిందూ దేవతలను అనడానికి మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తోంది.అది తప్పు.

అలా దూషించకండి.ఇలా అనేసి ఏమీ కాదు అనుకుంటే కుదరదు.

మనోభావాలు గాయపడుతున్నాయి.దయచేసి ఇది నా విన్నపం.

అని పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )వచ్చారు.అయితే అదే వీడియోని ట్విట్టర్లో షేర్ చేసిన అభినవ్ గోమటం.

( Abhinav gomatam ) సెక్యులరిజాన్ని దుర్వినియోగం చేయడాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ సార్‌కి కృతజ్ఞతలు.సనాతన ధర్మం పురాతనమైనది, ఎంతో గొప్పది.

ఒక పౌరుడిగా దీనిపై మాట్లాడే హక్కు నాకు ఉంది.దీనికి రాజకీయంతో ఎలాంటి సంబంధం అవసరం లేదు అని రాసుకొచ్చారు అభినవ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube