స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంపై ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగిన విషయం తెలిసిందే.అదవిధంగా కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై కూడా వాదనలు ముగిశాయి.
సీఐడీ తరపున ఏఏజీ పొన్నాల వాదనలు వినిపించగా చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా న్యాయస్థానం ఏ తీర్పును వెలువరిస్తుందోనన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.