తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.మరో నేత స్వామిగౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఈ మేరకు పార్టీని వీడుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు స్వామిగౌడ్ లేఖ రాశారు.ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
దీనిలో భాగంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ తో స్వామిగౌడ్ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా బీజేపీపై పలు విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడం లేదని స్వామిగౌడ్ తెలిపారు.పార్టీలో ధనవంతులకు, బడా కాంట్రాక్టర్లకు ప్రాతినిధ్యం పెంచుతున్నారని చెప్పారు.
బలహీన వర్గాల నేతల పట్ల అనుసరిస్తున్న తీరు ఆక్షేపనీయంగా ఉందని పేర్కొన్నారు.నిజాయితీగా పని చేసే వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పార్టీలో అవమానాలు భరిస్తూ కొనసాగలేకపోతున్నట్లు స్వామిగౌడ్ లేఖలో పేర్కొన్నారు.