జగన్ కు షాక్.. వర్కౌట్ అవుతున్న టీడీపీ ప్లాన్స్ !

ఏపీలో రాజకీయాలు( Politics in AP ) క్షణక్షణం మారిపోతున్నాయి.ముఖ్యంగా అధికార వైసీపీలో( YCP ) చోటు చేసుకుంటున్న పరిణామాలు జగన్ కు తీవ్ర తలనొప్పిగా మారుతున్నాయి.

 A Shock To Jagan Tdp Plans Are Being Worked Out , Tdp, Jagan, Politics In Ap, Y-TeluguStop.com

గత కొన్నాళ్లుగా వైసీపీలో అంతర్మథనం రగులుకున్న సంగతి తెలిసిందే.ఆయా నియోజిక వర్గాల వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటు తాజాగా వస్తున్న సర్వేలు కూడా జగన్ కు షాక్ ఇస్తున్నాయి.దీంతో వీలైనంత త్వరగా పార్టీని వీడితే బెటర్ అని కొందరు సిట్టింగ్ ఎమ్మేల్యేలు భావిస్తున్నారని టాక్.

ఎందుకంటే గత కొన్నాళ్లు గా 40 మంది ఎమ్మెల్యేల విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తిగా కనిపిస్తున్నారు.

Telugu Ap, Ap Poolitics, Chandrababu, Jagan, Rayalaseema-Latest News - Telugu

పలు మార్లు జరిగిన ఎమ్మెల్యేల సమీక్షలో కూడా ప్రత్యేకంగా ఆ 40 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇచ్చారు కూడా.దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారికి ఈసారి సీట్ ఇచ్చే అవకాశాలు కూడా తక్కువే అనే వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే ఆ 40 మంది ముందు జాగ్రత్తగా టీడీపీలోకి( TDP ) వెళ్ళేందుకు మార్గం సిద్దం చేసుకుంటున్నారట.ఇప్పటికే టీడీపీ నేతలు పలు మార్లు ఈ విషయాలను చెప్పుకొచ్చారు కూడా.40 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అధినేత బాబు అనుమతీస్తే వారంతా ఏ క్షణమైనా టీడీపీలో చేరతారని టీడీపీ శ్రేణులు పదే పదే చెబుతున్నారు.

Telugu Ap, Ap Poolitics, Chandrababu, Jagan, Rayalaseema-Latest News - Telugu

ఇక వైసీపీలోని అసంతృప్త నేతలపై చంద్రబాబు( Chandrababu ) గట్టిగా దృష్టి పెట్టిరట.నియోజిక వర్గాల వారీగా వైసీపీ అసంతృప్త నేతల లిస్ట్ రెడీ చేసి వారిని టీడీపీలో కలుపుకునేందుకు చంద్రబాబు వ్యూహరచన మొదలు పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి.రాయలసీమ నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మేల్యేలు, ఉత్తరాంధ్ర నుంచి ఏడుగురు, గోదావరి జిల్లాల నుంచి 3.ఇలా కొంతమంది ఇప్పటికే బాబుతో మంతనాలు కూడా జరిపారట .ఒకవేళ సీట్లు కన్ఫర్మ్ కాకపోతే వారంతా కూడా నిరభ్యంతరంగా వైసీపీని విడేందుకు సిద్దంగా ఉన్నట్లు టాక్.దీంతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మేల్యేలు పార్టీ మరకుండా ఉండేందుకు జగన్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube