కొత్తగా ఫ్లాట్ కొనాలని అనుకున్నవారు ఈ వార్తను ఖచ్చితంగా చదవాల్సిందే.ఎందుకంటే మీరు కూడా ఫ్లాట్ కొని ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది.
మనలో చాలా మంది ఫ్లాట్ బుక్ చేసుకుని చేతికి అందకుండా ఏళ్లు తరబడి ఎదురు చూస్తున్న ఘటనలు అనేకం ఉంటాయి.బిల్డర్లు ఇచ్చిన తేదీ కంటే ఇల్లు ఇవ్వడానికి సంవత్సరాలు ఆలస్యం చేయవచ్చు.
అటువంటి సందర్భంలో వినియోగదారుడు పరిహారం పొందేందుకు వీలు కల్పించే చట్టం కూడా ఒకటుందని మీకు తెలుసా? అయితే ఈ కధనం వింటే మీకు ఓ పరిస్కారం దొరుకుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఓ సంఘటన ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.అవును, ఒక కస్టమర్ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఏకంగా 16 లక్షల రూపాయల పరిహారం పొందాడు.నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణ ప్రాజెక్ట్ ప్రమోటర్ కంపెనీ అయిన ‘నెక్స్‌జెన్ ఇన్‌ఫ్రాకాన్’ 3 సంవత్సరాలు ఆలస్యంగా కస్టమర్‌కు ఓ ఫ్లాట్‌ను అప్పగించింది.దీనిని ప్రశ్నిస్తూ వినియోగదారుడు ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని సంప్రదించగా ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన రెరా కోర్టు( Rera court ) వినియోగదారునికి రూ.16 లక్షల పరిహారం చెల్లించాలని ప్రమోటర్ కంపెనీని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే, 2017లో సదరు వ్యక్తి 1.35 కోట్లు చెల్లించి మరీ ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు.డిసెంబర్ 2018 నెలలో ఫ్లాట్‌ను అప్పగిస్తామని చెప్పిన ప్రమోటర్ కంపెనీ రెండేళ్ల తర్వాత కూడా అతనికి ఫ్లాట్ ఇవ్వలేకపోయింది.దాంతో ఆ కస్టమర్ 2021 లో రెరాకు ఫిర్యాదు చేశాడు.
అప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఫ్లాట్ అప్పగిస్తామని చెప్పారు.అయితే, ఫ్లాట్‌ను 2018లో అప్పగించాల్సి ఉన్నందున రెరా కోర్టు కేసును విచారించి వినియోగదారునికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
వినియోగదారుడు చెల్లించిన మొత్తానికి 2018 నుంచి వడ్డీని లెక్కించి మరీ 16 లక్షల రూపాయలు చెల్లించాలని నెక్స్‌జెన్ ఇన్‌ఫ్రాకాన్( Nexgen Infracon )ను కోర్టు ఆదేశించింది.రెరా చట్టం నియమం ప్రకారం.
వడ్డీ ఎంసీఎల్‌ఆర్ రేటు ఆధారంగా లెక్కించబడుతుంది.కాబట్టి మిత్రులుగా మీరు కూడా ఇటువంటి సమస్యలలో ఇరుక్కుంటే వెంటనే మేలుకోండి మరి.