తల్లి తన బిడ్డను ప్రపంచంలోని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది.తన బిడ్డను సంతోషంగా, సురక్షితంగా ఉంచడానికి తల్లి ఎంతటి సాహసమైనా చేస్తుంది.
మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి తల్లి నిస్వార్థ ప్రేమను మనం చూస్తుంటాం.తల్లి జంతువులు పిల్లలతో బలమైన బంధాన్ని కలిగి ఉంటారయి.
తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది.ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో ఒక తల్లి ఎలుగుబంటి పిల్ల ఎలుగుబంటిని కాపాడిన వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో తల్లి పిల్ల కోసం చేసిన సాహసాన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఈ వీడియోను @Gabriele_Corno ట్విట్టర్( Twitter) అకౌంట్ పోస్ట్ చేసింది.ఈ క్లిప్ లో బండలపై నుంచి జారి నీటిలో పడిపోయిన ఒక ధ్రువపు ఎలుగుబంటి( Polar bear ) పిల్లను మనం చూడవచ్చు.నీరు చాలా చల్లగా, లోతుగా ఉంది.
దురదృష్టం కొద్దీ ఆ పిల్ల ఎలుగుబంటికి ఈత కూడా రాదు.ఇది నీటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆ చేయడం దానికి అసాధ్యంగా మారింది.
తల్లి ఎలుగుబంటి ఇది చూసి తన పిల్లకు సహాయం చేయడానికి పరిగెత్తుకు వచ్చింది.అది నీటిలోకి దూకి తన పిల్లకు బండలపైకి సురక్షితంగా ఎక్కేలా చేసింది.
వీడియో చాలా మందిని హత్తుకుంది.తల్లి ఎలుగుబంటి తన పిల్ల కోసం ఎంత శ్రద్ధ వహిస్తుందో ఇది చూపిస్తుంది.అది ధైర్యవంతురాలు, తెలివైనది అని చాలా మంది పొగిడేస్తున్నారు.తన పిల్ల మునిగిపోకుండా తల్లి చేసిన సాహసానికే హాట్సాఫ్ అంటున్నారు.ఈ వీడియో లక్ష కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.దీనిపై చాలా మంది కామెంట్స్ చేశారు.తల్లి ప్రేమ జంతువులు, మానవులలో సమానంగా ఉంటుంది, ధృవపు ఎలుగుబంట్లు అద్భుతంగా ఈదగలవు అని ఒకరు కామెంట్ చేశారు.“తల్లులు తమ పిల్లల కోసం అన్నీ చేస్తారు, అవసరమైనప్పుడు అమ్మ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది.” అని అన్నారు.తల్లి ప్రేమకు చిన్న ఉదాహరణగా నిలిచే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.