గుండెపోటుతో ఐకియాలో కూలబడ్డ వ్యక్తి... CPR చేసి క్షణాల్లో ప్రాణం కాపాడిన మరో కస్టమర్!

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటుకి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తూ వున్నాం.ఆకస్మికంగా గుండెపోటు రావడం, ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వలన అర్ధాంతరంగా చనిపోతున్నారు.

 A Man Who Collapsed In Ikea Bangalore Due To Heart Attack Another Customer Who-TeluguStop.com

ఇక అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తే CPR (కార్డియో పల్మనరీ రిసిటేషన్‌) చేస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఇక దీనిని రుజువు చేసిన ఘటనలు కూడా మనం ఇటీవల చూస్తూ వున్నాం.

తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.

అవును, బెంగళూరు ఐకియాలో షాపింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కూలబడ్డాడు.

దాంతో అక్కడున్న వారంతా భయపడిపోడిపోయారు.సరిగ్గా అదే సమయానికి అతనికి చేరువలో వున్న ఒక వైద్యుడు (ఆర్థోపెడిక్‌ సర్జన్) ఆ వ్యక్తిని రక్షించడానికి వచ్చి కార్డియో పల్మనరీ రిసిటేషన్‌ చేయడం మొదలు పెట్టాడు.

సకాలంలో అలా బాధితుడి ఛాతీపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు.ఘటనా స్థలంలో ఉన్న డాక్టర్ కుమారుడు రోహిత్‌ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా ఈ విషయం బయటకు తెలిసింది.

కాగా ఆ డాక్టర్ కొడుకు సదరు వీడియో గురించి వివరించడం ఇక్కడ చూడవచ్చు.10 నిమిషాలకు పైగా ప్రక్రియ కొనసాగిందని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.ఈ వీడియోపై నెటిజన్లు కూడా భారీగా స్పందిస్తున్నారు.సకాలంలో ప్రాణాలు కాపాడిన వైద్యుడిని అభినందనలతో ఆకాశానికెత్తేస్తున్నారు.సకాలంలో వైద్యం చేసి అతనికి మరో జీవితం ప్రసాదించిన దేవుడు ఈ డాక్టర్ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే….

అందుకే అంటారు, వైద్యులు దేవునితో సమానం అని మరో యూజర్ కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube