కొన్ని చోట్ల అధికారులు చేస్తున్న ఘనకార్యాలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ విమర్శల పాలవుతోంది.సదరు సిబ్బంది ఒళ్ళు ఒంగని తనం, నిర్లక్ష్యం, ధనదాహం కారణంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులు గంగలో పోసిన పన్నీరు మాదిరి తయారయ్యాయి.
దీంతో సర్కార్ పలు విమర్శలకు గురవుతోంది.కింది స్థాయి ఉద్యోగులు, కూలీలు కలిసి చేసిన తప్పులు కారణంగా కేంద్ర ప్రభుత్వం బలవుతోంది అనడానికి ఇదే ఉదాహరణ.
ఇక్కడ ఫొటో గమనిస్తే నలుగురు కలిసి కూర్చునేందుకు వీలుగా ఒకే చోట మరుగుదొడ్డి ఏర్పాటు చేయటం చాలా స్పష్టంగా కనబడుతోంది.
కాగా ఈ టాయిలెట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘనకార్యం ఎక్కడ జరిగిందంటే, ఉత్తరప్రదేశ్‌లోని టౌన్‌షిప్‌లో స్వచ్ఛ్ భారత్ మిషన్ పథకం ద్వారా నిర్మించబడింది.టౌన్‌షిప్ ప్రధాన కార్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలోని తహసీల్ రుదౌలీ ప్రాంతంలోని ధన్సా గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ ఇది.బేసిగ్గా ఏదైనా కమ్యూనిటీలో టాయిలెట్స్ ని పరిశీలిస్తే ఓ ఇద్దరు విడివిడిగా నిర్మించబడి ఉండటం మనం చూడవచ్చు.కానీ ఇక్కడ ఇలాగ అందరు కలిసి కాలకృత్యాలు తీసుకునేలాగా నిర్మించడం ఇపుడు పలు వివాదాలకు దారితీస్తోంది.
ఎలాంటి అడ్డుగోడ లేకుండా ఏకంగా 4 టాయిలెట్ సీట్లను ఏర్పాటు చేయడమే ఈ వివాదానికి కారణం.ఇటీవల కూడా ఇటువంటి వార్తానొకటి చూసాము.కాగా ఇది రెండవది.దాంతో నెటిజన్లు ఒక రేంజ్ లో అధికారులను దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక సదరు పల్లెటూరి వాసులు అయితే వారిని అవమాన పరచడానికి ఇలా చేసారంటూ తిట్లదండకాలు పెడుతున్నారు.టౌన్‌షిప్‌లోని పంచాయతీరాజ్ శాఖలోని సమర్థులైన అధికారులు మాత్రమే ఇలాంటి ఘనత చేయగలరంటూ కొంతమంది ఎద్దేవా చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.







