బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ప్రస్తుతం రెండవ సీజన్ ప్రసారమవుతుంది.
అయితే తాజాగా ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హాజరైన విషయం మనకు తెలిసిందే.ఇక ప్రభాస్ వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కానుంది.
ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తి అయింది.ప్రభాస్ ఎపిసోడ్ మొదటి భాగం డిసెంబర్ 30వ తేదీ ప్రసారం కావాల్సి ఉండగా ప్రేక్షకుల కోసం 29వ తేదీ రాత్రి ఈ కార్యక్రమాన్ని ఆహా ప్రసారం చేసింది.
ఈ కార్యక్రమానికి ప్రభాస్ వస్తున్నారని తెలియడంతో కార్యక్రమం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం అవుతున్న సమయంలో ఆహా క్రాష్ అవ్వడం గమనార్హం.
దీంతో ఆహా కొంత సమయం పాటు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి అనంతరం ప్రసారం చేశారు.ఇలా ప్రభాస్ ఎపిసోడ్ అంటేనే ఈ ఎపిసోడ్ పై ఎన్నో అంచనాలు పెరిగాయి.
ముఖ్యంగా ఆయన సినిమాల గురించి అదే విధంగా తన గురించి వస్తున్నటువంటి రూమర్ల గురించి ఈ కార్యక్రమంలో ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ ఎపిసోడ్ తో ఆహాకు అదిరిపోయే రేటింగ్ వచ్చిందని చెప్పాలి.కేవలం 24 గంటలలోనే ఈ ఎపిసోడ్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసినట్లు ఆహా తెలియజేశారు.ఈ క్రమంలోనే ఆహా ప్రభాస్ అభిమానులకు అలాగే సబ్స్క్రైబర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
మొత్తానికి ప్రభాస్ ఎపిసోడ్ ఆహాలో సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పాలి.అయితే ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొక ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.
మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.







