గుర్రంపై స్వారీ చేస్తున్న కుక్క.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.ఈ వీడియోలో ఒక తెల్ల గుర్రంపై ఒక కుక్క ఎక్కి స్వారీ చేసింది.

 A Dog Riding A Horse Viral Video Horse , Riding, Dog, Viral Latest, News Viral,-TeluguStop.com

సాధారణంగా ఎంతో శిక్షణ పొందిన మనుషుల మాత్రమే గుర్రాలపై చక్కగా రైడ్ చేయగలరు.లేదంటే గుర్రం వారిని ఎత్తి పడేస్తుంది.

మనిషిని మాత్రమే కాదు ఇతర ఏ జంతువునైనా అవి తమ భుజాలపై మోసుకెళ్లవు.కానీ ఈ గుర్రం మాత్రం చాలా శాంతంగా ఒక కుక్కను తన భుజాలపై ఎక్కించుకొని రోడ్లపై తిరుగుతోంది.

దీనికి సంబంధించిన @yoda4ever అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియో క్లిప్ కి ఇప్పటికే నాలుగు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక శునకం గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది.

ఈ గుర్రం ఒక సిటీ అంతటా చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.ట్రాఫిక్ లైట్ల వద్ద కూడా ఆగి రూల్స్ పాటిస్తూ ఆశ్చర్యపరిచింది.

కుక్క గుర్రం వెనుకభాగంలో హాయిగా నిల్చొని రైడ్‌ను ఆస్వాదించింది.ఈ అద్భుతమైన దృశ్యాలను వాహనదారులు తమ కెమెరాలో బంధించారు.

అయితే ఇది ఎక్కడ చోటుచేసుకుంది అనేది మాత్రం తెలియరాలేదు.“పావ్ పెట్రోల్,” అని ఈ పోస్ట్ కి ట్విట్టర్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.అసలు ఎలాంటి కంట్రోల్ లేకుండా ఈ గుర్రం అంత శాంతంగా ఎలా వెళ్తుంది? అని మరి కొందరు అవాక్కవుతున్నారు.ఈ క్యూట్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube