కెమెరాకు చిక్కిన తెల్లని వింత ఆకృతి.. ఏలియనే అంటున్న నెటిజన్స్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక భయానక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో నెటిజన్లకు గూస్‌బంప్స్ ఇస్తోంది.

 The Strange White Shape Caught By The Camera Details, Viral Latest , News Viral,-TeluguStop.com

దీంట్లో కనిపించిన ఒక వికృత రూపం అందరికీ హడల్ పుట్టిస్తోంది.ఈ ఆకారం ఏంటో తెలియక చాలామంది తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.33-సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ లో ఒక తెల్లటి జీవి రోడ్డుపై వంకరగా నడుస్తున్నట్లు చూడవచ్చు.రాత్రిపూట ఇది చాలా నెమ్మదిగా వాక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.వీడియోలో ఒక వింత జీవి వంగి ఏదో వెతుకుతున్నట్లు మీరు గమనించవచ్చు.

ఈ వీడియోకి ఇప్పటికే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో అద్భుతంగా చక్కర్లు కొడుతుండగా.

దీనిని చూసి చాలామంది వామ్మో ఏంటిది అని తమ భయాన్ని వ్యక్తపరుస్తున్నారు.ఈ జీవి ‘ఏలియన్’ అయి ఉండొచ్చని కొందరు ఊహిస్తే, మరికొందరు ఇదంతా బూటకమని అభిప్రాయపడ్డారు.

ఒక వ్యక్తి వైట్ సూట్ ధరించి ఇలా చీకటిలో నడుస్తూ ఉండొచ్చని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డు అయి ఉంటే కెమెరా ఎందుకు షేక్ అవుతుంది అని ఇంకొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని ఒకరు ఫోన్ ద్వారా తీసి ఉండొచ్చని మరికొందరు వివరణ ఇస్తున్నారు.

మానవుడి దృష్టికి రాని వింత జంతువులు, జీవులు ఎన్నో ఉన్నాయని చాలామంది బలంగా విశ్వసిస్తుంటారు.కెమెరాలో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అవి ఆ రహస్యమైన జీవులే అని అనుకుంటున్నారు.ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ లతో ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో లాంటి ఎన్నో వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube