గుర్రంపై స్వారీ చేస్తున్న కుక్క.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.ఈ వీడియోలో ఒక తెల్ల గుర్రంపై ఒక కుక్క ఎక్కి స్వారీ చేసింది.

సాధారణంగా ఎంతో శిక్షణ పొందిన మనుషుల మాత్రమే గుర్రాలపై చక్కగా రైడ్ చేయగలరు.

లేదంటే గుర్రం వారిని ఎత్తి పడేస్తుంది.మనిషిని మాత్రమే కాదు ఇతర ఏ జంతువునైనా అవి తమ భుజాలపై మోసుకెళ్లవు.

కానీ ఈ గుర్రం మాత్రం చాలా శాంతంగా ఒక కుక్కను తన భుజాలపై ఎక్కించుకొని రోడ్లపై తిరుగుతోంది.

దీనికి సంబంధించిన @yoda4ever అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియో క్లిప్ కి ఇప్పటికే నాలుగు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి వైరల్ అవుతున్న వీడియోలో, ఒక శునకం గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది.

ఈ గుర్రం ఒక సిటీ అంతటా చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.

ట్రాఫిక్ లైట్ల వద్ద కూడా ఆగి రూల్స్ పాటిస్తూ ఆశ్చర్యపరిచింది.కుక్క గుర్రం వెనుకభాగంలో హాయిగా నిల్చొని రైడ్‌ను ఆస్వాదించింది.

ఈ అద్భుతమైన దృశ్యాలను వాహనదారులు తమ కెమెరాలో బంధించారు. """/"/ అయితే ఇది ఎక్కడ చోటుచేసుకుంది అనేది మాత్రం తెలియరాలేదు.

"పావ్ పెట్రోల్," అని ఈ పోస్ట్ కి ట్విట్టర్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.

దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.అసలు ఎలాంటి కంట్రోల్ లేకుండా ఈ గుర్రం అంత శాంతంగా ఎలా వెళ్తుంది? అని మరి కొందరు అవాక్కవుతున్నారు.

ఈ క్యూట్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

బయోటిన్ అంటే ఏమిటి.. మన శరీరానికి ఎందుకు అవసరం..?