దక్షిణాది అందం అసిన్ తెగ తిరిగేస్తోంది.ఈ వారం ఓ దేశంలో ఉంటే మరో వారం మరో దేశంలో ఉంటోంది.
సినిమాలు మానేసిందిగా , ఖాలిగా ఉంటే బోర్ కొట్టి ఉంటుంది, అందుకే తిరిగుతుందేమో అనుకోకండి.అసలు కారణం వేరే ఉంది.
మైక్రోమ్యాక్స్ మొబైల్స్ అధినేత రాహుల్ శర్మ తో మూడు ముళ్ళు వేయించుకోబోతున్న అసిన్, పెళ్లి పనుల్లో నిత్యం బిజీ బిజీగా ఉంటోంది.వీళ్ళిద్దరూ ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు.
పెళ్లి కోసం షాపింగ్ ఇప్పుడే మొదలుపెట్టింది అసిన్.మొన్నే లండన్ బయలుదేరింది బట్టలు కొనుక్కోవడానికి.
ఓ వారం అక్కడే ఉండి, అక్కడి నుంచి ప్యారిస్ కి వెళ్తుందట.అక్కడషాపింగ్ అయిపోగానే మళ్ళి న్యుయార్క్ లో షాపింగ్ చేస్తుందట.
మనం అమీర్ పేట్ లో కొన్ని బట్టలు కొనుక్కొని, అటు నుంచి పంజాగుట్ట కి వెళ్లి , అక్కడ నచ్చకపోతే సికింద్రాబాద్ లో బట్టలు కొన్నంత ఈజీగా అసిన్ ఈ దేశం నుంచి ఆ దేశం అంటూ తిరుగుతోంది.
టైం అలాంటిది.
కాబోయే శ్రీవారు ఎవరు మరి, వేల కోట్ల అధిపతి !
.