మేనకా గాంధీ రిజర్వేషన్

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బస్సు కోసమో, రైలు కోసమో రిజర్వేషన్ చేయించుకోలేదు.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

 Implement 33 Percent Reservation For Women In Police Force-TeluguStop.com

మహిళలకు సంబంధించి జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా పోలీసులు ఉండాలన్నారు.మహిళలకు పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా అవసరమని, ఈ పని చేయకపోతే మహిళలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావని మేనకా గాంధి అన్నారు.

గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేశారని చెప్పారు.రిజర్వేషన్ విషయమై కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.

మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు.మేనకా గాంధీ చెప్పింది వాస్తవమే.

అయితే పోలీసు శాఖలో ఇప్పటకీ మగవారి ఆధిపత్యమే కొనసాగుతున్నది.ఐ పీ ఎస్ అధికారులను తప్ప మిగిలిన మహిళా పోలీసు అధికారులను అంతగా ఖాతరు చేయడంలేదు.

పోలీసు కానిస్టేబుళ్ల పరిస్థితి దారుణంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube