ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..ఆ జానర్ లో రాబోతోందా?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే .రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో హీరోగా ఈయన నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర (Devara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Director Prashanth Neel Gives Big Update For Ntr 31 Movie, Ntr,prashanth Neel, W-TeluguStop.com
Telugu Jr Ntr, Periodic, Prashanth Neel, Salaar, War-Movie

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 (War 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే.

Telugu Jr Ntr, Periodic, Prashanth Neel, Salaar, War-Movie

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమా ఏ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయంపై ఇన్ని రోజులు అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.అయితే ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ స్పందించారు.

ఎన్టీఆర్(NTR) తో మైథలాజికల్ సినిమా చేయడం లేదు.కెరీర్లో ఒక మైథలాజికల్ మూవీ చెయ్యాలనే ఐడియా ఉంది.కానీ ఈ మూవీ ఇప్పుడు తారక్ తో చెయ్యడం లేదనీ క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పిరీయాడిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని క్లారిటీ ఇచ్చారు.ఇక దేవర పార్ట్ వన్ పూర్తి అయిన తర్వాతనే సలార్ 2 (Salaar2)  ఉంటుందని ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయిందని సలార్ 2 గురించి కూడా ప్రశాంత్ అప్డేట్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube