ప్రభాస్‌కు ఆ సినిమా సెకండాఫ్ అస్సలు నచ్చలేదు కానీ..?

2011లో విడుదలైన రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ “మిస్టర్ పర్ఫెక్ట్”( Mr.Perfect Movie ) బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.దీన్న దశరధ్ డైరెక్ట్ చేశాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించాడు.ఇందులో ప్రభాస్,( Prabhas ) కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలు పోషించారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

 Prabhas Didnt Like Second Half Of Mr Perfect Details, Prabhas, Mr Perfect Movie,-TeluguStop.com

ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా నిలిచింది.ప్రభాస్ కెరీర్ లో ఒక టైమ్‌లెస్ క్లాసిక్ కూడా అయ్యింది.

అయితే ఇంత మంచి సినిమాని చేయకూడదని ప్రభాస్ మొదట అనుకున్నాడట.ఈ విషయాన్ని తాజాగా దీన్ని నిర్మించిన దిల్ రాజే వెల్లడించాడు.

దిల్ రాజు( Dil Raju ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.“నేను మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా స్టోరీ గురించి దర్శకుడు దశరధ్ తో డిస్కస్ చేయడం మొదలుపెట్టాను.ఒక పాయింట్ నుంచి కథలో ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యాను.ఆ సమయంలో ప్రభాస్ మలేషియాలో బిల్లా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.కథ వినిపించడానికి మేం మలేషియా వెళ్లాం.మొత్తం సినిమా స్టోరీ విన్నాక ప్రభాస్ కొంచెం డౌట్ వ్యక్తం చేశాడు.

Telugu Dil Raju, Dasarath, Kajal Aggarwal, Perfect, Perfect Story, Prabhas, Prab

ఫస్టాఫ్ అతనికి బాగా నచ్చిందని మేం గమనించాం.సెకండాఫ్ ఆయనకు నచ్చలేదని మాకు తెలిసిపోయింది.ఆయన అప్పటికప్పుడే అంగీకారం తెలపలేకపోయాడు.అందువల్ల మేం స్క్రిప్ట్ మొత్తం చక్కగా రెడీ చేసి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మళ్ళీ వినిపిస్తాం అని చెప్పాం.””కొద్దిరోజులకు ప్రభాస్ మా ఆఫీస్‌కి వచ్చాడు.నో చెబుదామనే వచ్చాడు కానీ మేము రెండో సారి అతనికి సెకండాఫ్ వినిపించడంతో బాగా నచ్చేసింది.సెకండాఫ్ విన్నాక ప్రభాస్ ఆశ్చర్యపోయాడు.‘దిల్ రాజు గారు ఈ సినిమా నేను చేయకూడదని చెప్పడానికే వచ్చాను కానీ మీరేదో మ్యాజిక్ చేసి సెకండ్ హాఫ్ మార్చేశారు.

Telugu Dil Raju, Dasarath, Kajal Aggarwal, Perfect, Perfect Story, Prabhas, Prab

అది ఎలా సాధ్యమైంది?’ అని సర్ ప్రైజింగ్ గా అడిగాడు.” అని చెప్పుకొచ్చాడు.ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకొని చాలా మంచి పని చేశాడు.ఈ మూవీలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.ఎంతోమంది అభిమానులకు మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా ఫేవరెట్ అయిపోయింది.దీన్ని మిగతా భాషల్లో కూడా రీమేక్ చేశారు జపాన్ లో కూడా ఇది హిట్ అయింది.

కాజల్( Kajal ) కూడా చాలా బాగా నటించి మెప్పించింది.పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనేంత గొప్పగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube