జనరేషన్స్ మారిన ప్రతిసారి సినిమా ఇండస్ట్రీ కూడా తన పోకడను మార్చుకుంటూ వెళుతుంది.అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త నటులు పుట్టుకొస్తూనే ఉంటారు.
పాత నీరు వెళ్ళిపోతూనే ఉంటుంది కొత్తనీరు వచ్చి చేరుతూ ఉంటుంది.అలాగే కమెడియన్స్ లో( Comedians ) కూడా పాతవారు మొహం మొత్తితే కొత్తవారు కనిపిస్తూ ఉంటారు.
తమ టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను సృష్టించుకుంటూ ఉంటారు.ప్రస్తుతం ఉన్న సినిమా పరిస్థితులలో కొత్త టాలెంట్ బాగా కనిపిస్తుంది.
నిన్న మొన్నటి వరకు బ్రహ్మానందం మరొక జనరేషన్ వెనక్కి వస్తే వెన్నెల కిషోర్ లాంటివారు తమ సత్తాన్ని తెలుగు సినిమా ప్రపంచానికి చాటి చెప్పారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతున్నట్టు కనిపిస్తుంది.
తమలోని టాలెంట్ బయట పెడుతూ కొత్త నటీనటులు బయటకు వస్తున్నారు.వారిలో కామెడీ కి ఎలాంటి కొదవలేదు అని నిరూపిస్తున్నారు.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కమీడియన్ సత్య.( Comedian Satya ) మత్తు వదలరా సీక్వెల్ తో కమెడియన్ సత్య మెయిన్ లీడ్ స్థాయికి దూసుకెళ్లాడు.ఒకరకంగా హీరోని పక్కన పెట్టి సత్య కోసమే సినిమాకి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు.అంటే తన పర్ఫామెన్స్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక భవిష్యత్తులో సత్య తన జోరు మరింత పెంచి అనేక సినిమాల్లో అవకాశాలను అందుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక సత్య స్థాయిలోనే ఒంటి చేత్తో సినిమాను నడిపించగల సత్తా ఉన్న మరొక కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డి.( Comedian Rajkumar Kasireddy ) ఇటీవల ఆయ్ సినిమాలో రాజ్ కుమార్ తనదైనా నటనతో ఆకట్టుకున్నాడు.బెట్టింగ్ లాంటి వ్యవహారాల్లో తలదూర్చి కాస్త కాంట్రవర్సీకి గురైనప్పటికీ 2023వ సంవత్సరంలో ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి కమెడియన్ గా గుర్తింపు పొందాడు.
ఈ సంవత్సరం కాస్త వెనుక పడ్డట్టు అనిపించినా అయ్ సినిమాతో మల్లి తానేంటో నిరూపించుకున్నాడు.కచ్చితంగా రాజ్ కుమార్ కసిరెడ్డి భవిష్యత్తులో మంచి కమెడియన్ గా అవతరిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వీరి కన్నా ముందు ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ వచ్చారు.అలాగే వారి వారి స్థాయిలో మెప్పించారు.ఇక ముందు ముందు మాత్రం సత్య, రాజ్ కుమార్ వంటి వారికి అవకాశాలు దక్కుతాయి ఎందుకంటే కామెడీ టైమింగ్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి.