సూర్యాపేట జిల్లా: వాతావరణంలో మార్పులు చోటుచేసుకోడంతో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వ్యాపించే అవకాశం ఉందని,దీంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని,రైతులు చీడ, పీడల నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి బి.అనిల్ కుమార్ అన్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం ధర్మాపురంలో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి ఆయన వరి పంటను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట పాలుపోసుకునే గింజ గట్టిపడే దశలో ఉందని,ఎండు ఆకు తెగులు నివారణకు స్ట్రెప్టోమైసిన్ లేదా ప్లాంటమైసిన్ లేదా అగ్రోమైసిన్ 80 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని,ఎండు ఆకు తెగులు వాతావరణంలో
అధిక తేమ,అధిక వర్షాలు ఎక్కువ ఉండటం వలన ఉదృతి ఎక్కువగా గమనిస్తూ ఉంటామన్నారు.
నత్రజని ఎరువులను మోతాదు తగ్గించే వాడుకోవాలని సూచించారు.సుడి దోమ నివారణకు ఆశించిన పంటను ఎండబెట్టి ఎకరానికి వేప నూనె 1 లీటరు మరియు పైమెట్రోజైన్ 120గ్రా.
ఎకరం లేదా ఎతిప్రోల్+ పైమెట్రోజైన్ 170గ్రా.ఎకరం లేదా ట్రైఫ్లుమేజోపైరిం 94 మి.లీ/ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయన్నారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఏ.కిరణ్, మృత్తిక శాస్త్రవేత్త,ఆదర్శ్ సస్యరక్షణ శాస్త్రవేత్త, రైతులు బద్రు,కనకయ్య, నాగు,ప్రతాప్ రెడ్డి, సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు.