శ్రీదేవి నాకు చెల్లి కానీ ఆన్‌స్క్రీన్‌పై రొమాన్స్ చేయించారు: కమల్ హాసన్

దిగ్గజ నటుడు కమల్ హాసన్( Kamal Haasan ) అతిలోక సుందరి శ్రీదేవితో( Sridevi ) కలిసి 27 సినిమాల్లో నటించారు.తెరపై వీళ్లిద్దరూ రొమాంటిక్ కపుల్‌గా కనిపించేవారు.

 Kamal Hasan About Sridevi Details, Kamal Haasan, Sridevi, Kamal Haasan Sridevi M-TeluguStop.com

కానీ నిజ జీవితంలో వీళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ల వలె ఉండేవారట.ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసనే వెల్లడించాడు.

శ్రీదేవిని “నా చిట్టి చెల్లెలు” అని అభివర్ణించాడు.వీళ్ళిద్దరూ కలిసి మొదటి సారి నటించిన చిత్రం “మూడు ముడిచు”.

ఆ సమయంలో శ్రీదేవికి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి.

Telugu Aakali Rajyam, Actress Sridevi, Kamal Haasan, Kamalhaasan, Sridevi, Tolly

కమల్ హాసన్ శ్రీదేవి గురించి చెప్తూ, “నేను శ్రీదేవిని మొదటిసారి కలిసినప్పుడు ఆమె వయసు 15 లేదా 16 సంవత్సరాలు ఉండవచ్చు.మేం కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది.తెరపై ప్రేమ జంటగా కనిపించినా, నిజ జీవితంలో మేము తోడబుట్టిన వాళ్ళ లాగా ఉండేవాళ్ళం.

మేం కలిసి ఒకే స్కూల్‌లో చదివాం.అందుకే మా మేనరిజం ఒకేలాగా ఉంటుంది.

మేం జస్ట్ క్లాస్మేట్స్ కంటే ఎక్కువ.కుటుంబ సభ్యుల వలె ఫీలయ్యే వాళ్ళం.

చాలామంది మమ్మల్ని చూసి మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు అనేవారు లుక్స్ పరంగా సేమ్ ఉండేవాళ్ళం.కానీ దర్శకులు మమ్మల్ని ఒక జోడి లాగా సినిమాల్లో చూపించారు.

Telugu Aakali Rajyam, Actress Sridevi, Kamal Haasan, Kamalhaasan, Sridevi, Tolly

దానికి మేం చేసేది ఏమీ లేకుండా పోయింది.యాక్టర్లుగా మా పాత్రలు మేము పోషించాం.రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు మేం ఒకే ఇంటి నుంచి వచ్చిన వాళ్లమని అనిపించేది.ఆమెను కోల్పోవడం అంటే ఒక బంధువును కోల్పోయినట్లే.” అని చెప్పుకొచ్చాడు.కమల్ హాసన్ ఇంకా మాట్లాడుతూ శ్రీదేవి ఇలాంటివి గొప్ప నటీమణిని తాను ఎప్పుడూ చూడలేదు అని పేర్కొన్నాడు.

వీరిద్దరూ నటించే ఆకలి రాజ్యం,( Aakali Rajyam ) వసంత కోకిల,( Vasantha Kokila ) ఒక రాధా ఇద్దరు కృష్ణులు, అందగాడు, ఎర్ర గులాబీలు లాంటి ఎన్నో సినిమాలు తీశారు అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

Telugu Aakali Rajyam, Actress Sridevi, Kamal Haasan, Kamalhaasan, Sridevi, Tolly

“ఆమె విషయాలను నేర్చుకోవడంలో చాలా వేగంగా ఉండేది.ఒక స్పంజులా ఎలాంటి విషయాన్నైనా త్వరగా గ్రహించేది.” అని కూడా శ్రీదేవి గురించి కమల్ హాసన్ తెలిపాడు.శ్రీదేవి శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.రామారావు, డాక్టర్ రాజ్‌కుమార్, నాగార్జున, వెంకటేష్, అరవింద్ స్వామి, చిరంజీవి వంటి అగ్ర కథానాయకులందరితో కలిసి నటించింది.కె.బాలచందర్, బాలు మహేంద్ర, భారతిరాజా, దాసరి నారాయణ రావు, కె.రాఘవేంద్ర రావు, కె.భాగ్యరాజ్ వంటి ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో కూడా నటించింది.శ్రీదేవి కేవలం కథానాయికగా మాత్రమే కాకుండా, రకరకాల పాత్రలు చేసింది.

ఆమె మరణం మొత్తం భారతదేశ సినిమా పరిశ్రమకు తీరని లోటు అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube