రాజన్న సిరిసిల్ల జిల్లా , కరీంనగర్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న వెంకట్రావ్ పల్లి వద్ద ఉన్న సర్కిల్ ను ఈ రోజు వేములవాడ ఏఎస్పీ, రూరల్ సి.ఐ,బోయినపల్లి ఎస్.
ఐ లతో కలసి సందర్శించి అక్కడ జరుగుతున్న రోడ్ ప్రమాదాలకు గల కారణాలు అడిగి తెలుసుకొని అట్టి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసిన ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) ప్రమాదాలకు గల కారణాలు,వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాదల నివారణ చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఇప్పటికే జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై ,మూల మలుపుల వద్ద, అప్రోచ్ రోడ్ల వద్ద భారీ కేడ్స్, రబ్బర్ స్టిప్స్, సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ పృథ్వీందర్ గౌడ్ ఉన్నారు.