సినిమా రంగం అంటేనే ఒకింత రిస్క్ తో కూడుకున్న రంగం అనే సంగతి తెలిసిందే.ప్రతి సంవత్సరం తెలుగులో 100కు పైగా సినిమాలు విడుదలైతే ఆ సినిమాలలో హిట్టైన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
అయితే ఈ రంగంలో నిర్మాతలుగా కెరీర్ ను మొదలుపెట్టిన లాభాలను సొంతం చేసుకున్న వాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు.అయితే స్టార్ హీరోల, స్టార్ నిర్మాతల వారసురాళ్లు మాత్రం ఈ రంగంలో లక్ పరీక్షించుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా బాలయ్య చెరగని ముద్ర వేయగా బాలయ్య కూతురు తేజస్వి( Balakrishna Daughter Tejaswini )ని మోక్షజ్ఞ సినిమాతో లక్ పరీక్షించుకోనున్నారు.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తేజస్విని నిర్మాతగా మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.తేజస్విని బ్యానర్ పేరు లెజెండ్ ప్రొడక్షన్స్ అనే సంగతి తెలిసిందే.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం.
నాగబాబు కూతురు నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్( Niharika ) పై కమిటీ కుర్రోళ్లు సినిమాను నిర్మించి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు.చిరంజీవి కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్ లను నిర్మించగా త్వరలో చిరంజీవితో ఒక సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ కల్కి 2898 ఏడీ సినిమాతో సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో లాభాలను అందుకున్న సంగతి తెలిసిందే.
కృష్ణంరాజు కూతురు ప్రసీద రాధేశ్యామ్ మూవీకి ఒక నిర్మాతగా వ్యవహరించారు.కృష్ణ కూతురు మంజుల పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.
నిర్మాణ రంగంలో కెరీర్ కొనసాగిస్తున్న వారసురాళ్లు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.సెలబ్రిటీల వారసురాళ్లు సినిమా రంగంలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.