టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi) ఒకటి రెండు కాదు దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.ఏడుపదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్.
తాజాగా చిరంజీవి తన 69వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీ(Vishwambhara)లో నటిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.
ఇకపోతే చిరంజీవి తరంలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారు అగ్ర కథానాయకులుగా ఉన్నప్పటికీ మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు.తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకటేష్ లాంటివారంతా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు.చిరంజీవి పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ప్రయత్నాలు చేశారు.అయితే జనసేన పార్టీ ఆవిర్భావంతో పవన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు.
పవన్ కల్యాణ్ బదులుగా మహేష్ బాబు, చిరంజీవి ( Mahesh Babu, Chiranjeevi)కాంబినేషన్ లో సినిమా తీయాలని ఆయన భావించారు.కథ కూడా ఇద్దరు హీరోలకు బాగా నచ్చింది.
అయితే ఎందుకో త్రివిక్రమ్ కు కథ ఒక పట్టాన నచ్చలేదు.
ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన స్క్రిప్ట్ ను తయారు చేయలేకపోయారు.ప్రస్తుతానికి వద్దు.భవిష్యత్తులో చేద్దామని నిర్ణయించుకొని ఈ ప్రాజెక్టుకు టాటా చెప్పేశారు.
తర్వాత ఆచార్య( Acharya )లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కు బదులుగా మహేష్ బాబును అనుకున్నారు.కానీ ఆ సినిమా కూడా కుదరలేదు.దాంతో మహేష్ బాబు ప్లేస్ లో రాంచరణ్ నటించాల్సి వచ్చింది.అయితే దీనికోసం రాజమౌళిని బాగా బతిమలాడుకోవాల్సి వచ్చింది.
మహేష్ బాబు అయితే బడ్జెట్ భారీగా పెరిగిపోతోందని భావించడంతో రెండోసారి కూడా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.అలా రెండుసార్లు చిరు, మహేష్ బాబు కాంబోలో సినిమాలు మిస్సవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.
మరీ భవిష్యత్తులో అయినా మహేష్ బాబు చిరంజీవి కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి మరి.