అయినా.. ఇక్కడ కాంగ్రెస్ కు కష్టమేనా ? 

ఏపీ తెలంగాణ విభజన తరువాత పూర్తిగా ఏపీలో ఉనికి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ( Congress party ) .అప్పటి నుంచి జరుగుతున్న ఏ ఎన్నికల్లోను కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించలేకపోతోంది.

 However Is It Difficult For Congress In Ap , Ap Government, Ap Cm , Ysrcp ,ap Co-TeluguStop.com

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంతమందిని మార్చినా ఫలితం శూన్యం అన్నట్లుగా తయారయింది.మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్రమక్రమంగా పుంజుకుంటూ.

  ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని సాధిస్తూ వస్తుండగా,  ఏపీలో మాత్రం ఆ ఆశలు నెరవేరేటట్టు కనిపించడం లేదు.రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతుంది.

తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ఏ స్థానంలోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది.  దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీ పై ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టం అవుతుంది .కాంగ్రెస్ పై జనాల ఇంకా ఆగ్రహంతోనే ఉండడంతో,  ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు మరే పార్టీ ముందుకు రావడం లేదు.ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల( YS Sharmila ) ఉన్నారు.

Telugu Ap Cm, Ap Congress, Ap, Apcc, Revanth Reddy, Telanganacm, Tpcc, Ysrajasek

ఆమె వచ్చిన తర్వాత కాస్త పార్టీ కి ఊపు వస్తుందని అంతా భావించినా,  ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీగా షర్మిల పోటీ చేసి ఓటమి చెందారు.  ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YSR Birth Anniversary )75వ జయంతి వేడుకలకు పేరుతో షర్మిల హడావుడి చేశారు.తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కీలక నేతలను ఆహ్వానించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

అయినా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం ఏపీలో కనిపించడం లేదు.ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరిపోయారు.  ఇక ఏ పార్టీలో చేరే అవకాశం లేదనుకున్న వారు మాత్రమే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.తొలిసారి పిసిసి చీఫ్ గా  రఘువీరారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

Telugu Ap Cm, Ap Congress, Ap, Apcc, Revanth Reddy, Telanganacm, Tpcc, Ysrajasek

 2014లో అప్పుడే రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందింది.2019 ఎన్నికల్లో సాకే శైలజనాథ్ కు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు.  అయినా ఫలితం కనిపించలేదు .2024 ఎన్నికల్లో షర్మిల ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లినా ఏమాత్రం ప్రభావం కనిపించలేదు.పార్టీలోకి చేరికలు పెద్దగా లేకపోవడం, వైసిపి,  టిడిపి ఇప్పుడు జనసేన బలంగా ఉండడంతో కాంగ్రెస్ ను నాయకులు,  ప్రజలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు అయినా షర్మిల మాత్రం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతోనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube