తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు నాగ్ అశ్విన్( Directed Nag Ashwin ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డైరెక్టర్గా మంచి మంచి సినిమాలు తెరకెక్కిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్ అశ్విన్.
ఈయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా కల్కి.ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.
ఈ టీజర్ విడుదల అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాగ్ అశ్విన్ గురించి చర్చించుకుంటున్నారు.ట్రైలర్ చూసి ఆడియెన్స్ పిచ్చోళ్ళయిపోయారు.
ఆ గ్రాఫిక్స్, ఆ సెటప్ చూసి మనం హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ఏంది అనిపించే రేంజ్ లో విజువల్స్ తో నింపేశారు.
అసలు ఇప్పట్లో కల్కీ( Kalki ) ట్రైలర్ హ్యాంగోవర్ నుంచి సినీ ప్రియులు బయటకు వచ్చేలా కనిపించడమే లేదు.
ఇక ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఖచ్చితంగా కల్కీ తర్వాత నాగ్ అశ్విన్ గురించి, ఆయన మేకింగ్ గురించి మాట్లాడుకుంటారు అని కల్కీ రషేస్ చూసిన వాళ్లు చెబుతున్నారు.
రాజమౌళి( Rajamouli ) తర్వాత తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్‌కు నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడని అంటున్నారు ఫ్యాన్స్.ఇలాంటి మాటలు కల్కీ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ పోతున్నాయి.
నిజానికి నాగ్ అశ్విన్‌ను చూస్తే ఇతనేనా కల్కీ సినిమా చేసింది అనే డౌట్ పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు రావడం మాత్రం పక్కా.ఎందుకంటే నాగ్ అశ్విన్ అంత సింపుల్‌గా ఉంటాడు.జట్టు, గడ్డంతో ఎప్పుడూ ఒకే స్టైల్ లో కనిపిస్తుంటాడు.మరీ ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఎంత సింపుల్ గా ఉంటాడంటే ఆయన ఒంటిమీద టీ షర్టు, నైట్ ప్యాంట్, స్లిప్పర్స్ తోనే చాలా సార్లు చూసుంటాం.
ఏదైనా ఈవెంట్‌కు వచ్చినా ప్రోగ్రామ్‌కు వచ్చినా ఇంతే సింపుల్ గా వస్తుంటాడు.
అలానే ప్రస్తుతం నాగ్ అశ్విన్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.అదేంటంటే నాగ్ అశ్విన్ ఒక సింపుల్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్‌లో బయట కనిపించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఎందుకుంటే నాగ్ అశ్విన్ డ్రైవ్ చేస్తున్న కారు కేవలం రూ.10 నుంచి 11 లక్షలు మాత్రమే.రూ.600 కోట్ల సినిమా తీసిన నాగ్ అశ్విన్ పది లక్షల కారులో తిరగడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఒక్క కల్కీ కోసమే దాదాపు 8 కోట్లతో బుజ్జీని క్రియేట్ చేయించాడు.
అలాంటిది నాగ్ అశ్విన్ అంత చిన్న కారులో వెళ్లడం ఏంటని అనుకుంటున్నారు.ఇక నాగ్ అశ్విన్ ఎప్పుడూ కూడా సింపుల్ గానే కనిపిస్తుంటాడు.
ఇక ఆయన సింప్లిసిటీకి అభిమానులు మెచ్చుకుంటున్నారు.