రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న కార్పొరేట్ ప్రవేట్ పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని,అనుమతులు లేకుండా నడుస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలా గుర్తింపు రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందించిన ఏబీవీపీ నాయకులు.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వ నిబంధనల కి విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే పాఠ్యపుస్తకాలను అమ్ముతూ, విద్యార్థుల తల్లిదండ్రులను అడ్మిషన్ ఫీజు పేరుతో లేకపోతే పాఠశాల సగం ఫిజు ఇప్పుడే చెలించాలి అని వేధిస్తూ విద్యార్థుల, వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.అలాగే 1994 సంవత్సరంలో ప్రభుత్వం తీసుక వచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు పనిచేయాలని చెప్తున్న వాటిని ఏ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ధనార్జనే ధ్యేయంగా డొనేషన్లు, స్పెషల్ ఫీజులు, బస్సు ఫీజు, యూనిఫామ్ ఫీజు, బుక్స్ ఫీజ్ అని వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగానూ వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది.
అదే విధంగా 2009 లో వచ్చిన జీవో నెంబర్ 91 ప్రకారం కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు టెక్నో, ఈ టెక్నో, డిజి, టాలెంట్, ఒలింపియాడ్ అనే బ్రాండ్ పేరుతో పాఠశాల వద్ద పాఠ్యపుస్తకాలను అమ్మొవద్దని ఉన్న కూడా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపును రద్దుచేసి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కోరుతున్నామన్నారు.
లేని యెడల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్,ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు, ఎస్ ఎఫ్ డి ఏబీవీపీ వింగ్ విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్ ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ లోపెల్లి రాజు, ఎనగందుల శ్రీనివాస్,అన్నల్దాస్ పవన్ పాల్గొన్నారు.