కేరళను తరచుగా “గాడ్స్ ఓన్ కంట్రీ” అని పిలుస్తారు, అందమైన ప్రకృతి దృశ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోందీ రాష్ట్రం.ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించేందుకు కేరళ పర్యాటక శాఖ )( Kerala Tourism campaign)ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.
లండన్(london) నగరంలోని పాపులర్ డబుల్ డెక్కర్(Double-decker) బస్సులను కేరళ చిత్రాలతో అలంకరించడం ద్వారా అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.తమ రాష్ట్రాన్ని ప్రదర్శించడానికి లండన్‌నే పర్యాటక శాఖ ఎంచుకోవడం విశేషం.
ఈ బస్సులు ఇప్పుడు కేరళ(kerala) బ్యాక్ వాటర్స్ అందమైన చిత్రాలను ప్రదర్శిస్తున్నాయి.ఇవి ప్రశాంతమైన, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సరస్సులు.అనేక మంది పర్యాటకుల మనసులను దోచేసేలా ఈ నదులు అందంగా ఉంటాయి.ఈ బస్సులు కేరళలోని అలప్పుజా నుంచి హౌస్‌బోట్‌లు, సాంప్రదాయ పడవ పోటీల చిత్రాలను కూడా చూపుతాయి.
లండన్‌లో (london)ప్రస్తుతం వేసవి సెలవులు.ఈ సమయంలో అక్కడి ప్రజలు వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు.
అలాంటి ప్రజల దృష్టిని ఆకర్షించి, కేరళను సందర్శించేలా వారిని ప్రోత్సహించాలనేది ఆలోచన.
లండన్‌లోని ఈ బస్సులలో ఒకదానిని చూపించే వీడియోను చాలా మంది వ్యక్తులు పంచుకోవడంతో ఈ ప్రచారం సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందింది.రాష్ట్ర పర్యాటక లోగో, “#TravelForGood” అనే హ్యాష్‌ట్యాగ్‌తో సహా కేరళ రంగురంగుల చిత్రాలతో డెకరేట్ చేసిన బస్సును వీడియోలో చూడవచ్చు.ఈ వీడియో నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ ఫ్యూస్ వచ్చాయి, ప్రజలు దీనిపై నిజంగా ఆసక్తి చూపుతున్నారు.
ఆన్‌లైన్‌లో ప్రజలు ఈ ప్రచారం పట్ల తమ ఉత్సాహాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు.భారతదేశంలోని కొంత భాగాన్ని ఇంత సృజనాత్మకంగా ప్రమోట్ చేయడం చూసి వారు సంతోషిస్తున్నారు.కేరళ టూరిజం మంత్రి పి ఎ మహమ్మద్ రియాస్(PA Mohammed Riaz) కూడా ఈ వీడియోను పంచుకున్నారు.ఇతర దేశాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కొత్త ఆలోచనలను కోరారు.
కేరళ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.2018లో లండన్‌లోని ఐదు పెద్ద బస్సులపై కేరళ చిత్రాలను కూడా ఉంచారు.దీనికి ముందు, వారు లండన్, బర్మింగ్‌హామ్, గ్లాస్గోలలో టాక్సీలపై ప్రకటనలు పోస్ట్ చేశారు.