ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ గతేడాది డిసెంబర్ నెలలో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ కు ఇష్టమైన సీన్ ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.
ఈ సినిమా సెకండాఫ్ లో ఒక సన్నివేశంలో దేవా వరద రాజమన్నార్ ను గట్టిగా కౌగిలించుకునే సన్నివేశం ఉంటుంది.

దేవా, వరద మధ్య స్నేహ బంధాన్ని తెలిపే ఆ సీన్ అంటే ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కు ఎంతో ఇష్టమని సమాచారం అందుతోంది.ఈ సీన్ ను ప్రశాంత్ నీల్ రిపీట్ మోడ్ లో చూసేవారట.సలార్2 సినిమాలో దేవా, వరద పాత్రల మధ్య బాండింగ్ ను మరింత బాగా చూపించనున్నారని సమాచారం అందుతోంది.సలార్2 సినిమా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్, కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.సలార్2 షూటింగ్ త్వరలో మొదలుకానుందని తెలుస్తోంది.

సలార్2 శౌర్యాంగ పర్వం బాహుబలి2 సినిమాను మించి ఉండబోతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమా కాన్సెప్ట్ సైతం కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.సలార్2( Salaar2 ) సినిమాలో సైతం హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని సమాచారం అందుతోంది.సలార్2 సినిమాలో భారీ లెవెల్ యాక్షన్ సీన్స్ కు పెద్ద పీట వేస్తున్నారని తెలుస్తోంది.సలార్2 సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది.అదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని భోగట్టా.వచ్చే ఏడాది సలార్2 మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొంది.సలార్2 సినిమాపై ప్రభాస్( Prabhas ) ఫ్యాన్స్ మాత్రం భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.