సాధారణంగా మనలో కొందరి దంతాలు( Teeth ) పసుపు రంగులో ఉంటాయి.ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ లేకపోవడం, ధూమపానం తదితర కారణాల వల్ల తెల్లగా ఉండాల్సిన దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి.
ఇటువంటి దంతాలు కలిగిన వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.నలుగురిలో హాయిగా మాట్లాడేందుకు, ప్రశాంతంగా నవ్వేందుకు సంకోచిస్తుంటారు.
ఇతరులు తమ దంతాలను చూసి ఎక్కడ కామెంట్ చేస్తారో అని పదేపదే భయపడుతూ ఉంటారు.పైగా ఈ పసుపు దంతాలను( Yellow Teeth ) వదిలించుకోవడం పెద్ద సవాలుగా మారుతుంటుంది.
ఎన్ని రకాలు టూత్ పేస్ట్ లను వాడినా కూడా సరైన ఫలితం ఉండదు.
మీరు కూడా పసుపు దంతాలతో బాధపడుతున్నారా.? అయితే అసలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటించారంటే పసుపు దంతాలకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( Rice Flour ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్,( Lemon Juice ) వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ ను వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు బ్రష్ తో తోముకోవాలి.ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.నిత్యం ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే దంతాలపై పేరుకుపోయిన పసుపు మరకలు క్రమంగా మాయమవుతాయి.
మళ్లీ మీ దంతాలు తెల్లగా కాంతివంతంగా మెరుస్తాయి.కాబట్టి శాశ్వతంగా పసుపు దంతాలకు బై బై చెప్పాలి అని భావిస్తున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఇంటి చిట్కాలు పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.