రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )పరిధిలో సిరిసిల్ల పట్టణం నందు గల UNIQUE SMCS అనే సంస్థలో విడతలు వారిగా డబ్బుల కట్టి టర్మ్ ముగిసిన తరువాత డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న UNIQUE SMCS అనే సంస్థకు చెందిన ఇద్దరు ఏజెంట్ల పై ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని,UNIQUE SMCS అనే సంస్థలో డబ్బులు కూడా పెట్టుకొని మోసపోయిన వారు సబంధిత పోలీస్ స్టేషన్ లలో త్వరగా పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ( SP Akhil Mahajan ) గారు అన్నారు.ఈ మేరకు బుధవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూఎల్లారెడ్డిపేట్ మాండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దీకొండ సునీల్ అనే వ్యక్తి UNIQUE SMCS సిరిసిల్ల లో గల అనే ఓ సంస్థకు ఏజెంటుగా పనిచేస్తూ వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కు లక్ష్మి భర్త నర్సింగం దగ్గర నెలకు రెండు వేల రూపాయల చొప్పున 49 నెలలు చెల్లిస్తే మీకు కిస్తీలు అయి పోయిన తరువాత రెండు సంవత్సరాలు పూర్తి కాగానే మీకు మీరు చెల్లించిన దానికి అదనంగా డబ్బులు వస్తాయి అని నమ్మబలికినాడు.అదే గ్రామానికి చెందిన మరో మహిళ పొన్నం సరితను కూడా ఏజెంటుగా పెట్టుకుని అతను మాకు చెప్పినట్లే వెంకటాపుర్ గ్రామంతో పాటు అగ్రహారం, పోతిరెడ్డిపల్లి గ్రామాలలోని సుమారు 800 ల మందికి పైగా సభ్యులకు నచ్చజెప్పి ఈ సంస్థ లో చేర్పించారు.
జక్కుల లక్ష్మీ పాలసీ టర్మ్ తేది: 26-02-2024 తో ముగియగా తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వుమని సునీల్ ని అడుగగా అందుకు అతను స్పందించకపోగా నాకు ఏమీ తెలియదు కంపనీ వారికే సంబంధం ఉంటది, నేను కేవలం ఏజెంటుగా పని చేసాను మీరు సిరిసిల్లలోని ఆఫీసుకు వెళ్లి అడగండి అని చెప్పగా వారు సిరిసిల్ల లోని ఆఫీస్ కి వచ్చి అడుగగా అతను మీ ఏజెంటుకు సంబంధం ఉంటుంది మాకు ఏమీ తెలియదు అంటూ వారు మమ్ములను బెదిరించి పంపించాగా,సునీల్, సరితా డబ్బులు వస్తాయి అని నమ్మబలికి మాతో నెలనెల డబ్బులు కట్టించుకొని టైం అయిపోయినా కానీ మాకు డబ్బులు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతూ మమ్ములను మోసం చేసారని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్( Yellareddipet Police Station ) లో పిర్యాదు చేయగా వీరిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ప్రజలకు విజ్ఞప్తి UNIQUE SMCS అనే సంస్థలో డబ్బులు కూడపెట్టుకొని మోసపోయిన వారు సబంధిత పోలీస్ స్టేషన్ లో త్వరగా పిర్యాదు చేయాలని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోసం అనుమతి లేని చిట్ ఫండ్ సంస్థలను నమ్మి, డబ్బులు కూడపెట్టుకుంటారని అవసరానికి వారికి డబ్బులు ఇవ్వకుండా పరిమితులను ఉల్లంఘించిన లేదా గ్రూపు సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించక ఇబ్బందులకు గురి చేసే సంస్థల యాజమాన్యాలకు కఠినమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.