అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చైతన్య చేసిన మొదటి సినిమా అయిన జోష్ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు.ఇక దాంతో నాగ చైతన్య ( Naga Chaitanya ) తర్వాత ఏమాయ చేశావే సినిమాతో మాత్రం సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు అయితే చేసుకుంటూ వస్తున్నారు.
ఇక అందులో భాగంగానే చందు మొండేటి డైరెక్షన్ లో ‘తండేల్’( Thandel ) అనే సినిమా చేస్తున్నాడు.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ప్రేమమ్, సవ్యసాచి అనే రెండు సినిమాలు వచ్చాయి.ఇక ఇందులో ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ అవ్వగా, సవ్యసాచి డిజాస్టర్ అయింది.ఇక మూడోసారి కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో తనని తను మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంది.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ నందిని రెడ్డి సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉంటాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే నందిని రెడ్డి సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక నందిని రెడ్డి సినిమా అంటే లవ్ స్టోరీస్ కి ఎక్కువగా ప్రియార్టీ ఇస్తూ ఉంటారు.
కాబట్టి ఆమె నాగచైతన్యతో లవ్ అండ్ యాక్షన్ జానర్ లో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…