బెంగాలీ హిందీ పరిశ్రమంలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి షర్మిల ఠాగూర్( Actress Sharmila Tagore ).ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది షర్మిల.
కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలను కూడా అందించింది.అందుకుగాను ఆమెకు ఫిలిం పేరు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకుంది.2013లో ఆమెను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.కాగా షర్మిల ఠాగూర్ ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

వీరికి సైఫ్ అలీ ఖాన్ అనే కుమారుడితో పాటు సబ, సోహ ( Saba, Soha )అని ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.మన్సూర్ 2011లోనే కాలం చేశాడు.తర్వాత సినిమాలవైపే వెళ్లని షర్మిల గత ఏడాది గుల్మొహర్( Gulmohar ) అనే సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది.ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.తన పర్సనల్ ఫైనాన్స్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నేను కొన్న నగలు, కార్లు, ఇళ్లు.ఇలా ఏవైనా సరే అవన్నీ నా పేరు మీదే ఉంటాయి.ఆ ఆస్తిని భర్తతో కూడా పంచుకోలేదు.అతడు కూడా తను సంపాదించిన ఆస్తులను తనే మేనేజ్ చేసుకునేవాడు.చనిపోవడానికి ముందే ఏవి ఎవరికి చెందాలనేది వీలునామా రాశాడు.
నా ఆస్తులు కూడా నా ముగ్గురు పిల్లలకు సమానంగా పంచుతాను.ఆర్థిక విషయాలపై నాకంత అవగాహన లేకపోయేది.
కానీ లాక్‌డౌన్‌లో నాకంటూ ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకున్నాను.అప్పటి నుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాను అని తెలిపింది షర్మిల ఠాగూర్.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.