తాజాగా సావిత్రి క్లాసిక్స్( Savitri Classics ) పుస్తకం లాంఛ్ వేడుక హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది.ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి,( Vijaya Chamundeswari ) కుమారుడు సతీశ్ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి గురించి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి గొప్పగా మాట్లాడారు.
ఈ పుస్తకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా లాంఛ్ చేయడానికి కారణమేంటో కూడా ఆమె వివరించారు.ఈ సందర్బంగా చాముండేశ్వరి మాట్లాడుతూ.నేను ఫస్ట్ టైమ్ చిరంజీవి గారి ఇంటికెళ్లినప్పుడు కర్ర సాయంతో మెట్లపై నుంచి కిందకి వచ్చారు.
అయ్యో ఏమైంది కాలుకి అని అడిగితే డ్యాన్స్‌లో కాలుకి కాస్త గాయం అయిందమ్మా అంతే ఏం లేదు కూర్చో అంటూ ఆప్యాయంగా పలకరించి, మాట్లాడి, కాఫీ తెప్పించారు.అప్పుడు మాట్లాడుతూ నాకు ఉదయం లేవగానే అమ్మ ముఖం కనపడాలమ్మా.
నేను లేవగానే బెడ్‌రూమ్‌లో ముందుగా అమ్మ ఫొటోనే చూస్తానని( Savitri Photo ) చిరంజీవి చెప్పారు.
నేను నమ్ముతానో లేదోనని పైకి వెళ్లి ఆ ఫొటో తీసుకొచ్చి మరీ నాకు చూపించారు.అంతలా ఎవరు చేస్తారు.నిజాయితీ అంటే మన ఆలోచన, చెప్పే మాట, చేసే పని మూడూ ఒకటై ఉండాలి.
చాలా మంది మనసులో ఒకటి అనుకొని, మాటల్లో ఇంకొకటి చెప్పి, చేసేటప్పుడు వేరేది చేస్తుంటారు.కానీ చిరంజీవి గారికి ఆ మూడు ఒక్కటే.ఆ నిజాయితీయే నా మనసుకి తాకింది.అందుకే ఆయన తప్ప ఇంకెవరూ ఈ బుక్‌ను రిలీజ్ చేయకూడదు.
ఆయనే చేయాలని చెప్పి పట్టుపట్టి అడిగాను అని చాముండేశ్వరి తెలిపారు.ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు వైరల్ గా మారాయి.