చైనాలో కొత్త టెక్నాలజీ.. చూస్తే ఆశ్చర్యపోతారంతే..

చైనా( China ) టెక్ దిగ్గజం టెన్సెంట్ “వీచాట్ పామ్ పేమెంట్” అనే కొత్త పేమెంట్ మెథడ్‌ను అభివృద్ధి చేసింది.ఈ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 You Will Be Surprised To See The New Technology In China, China, Nri News, Tech-TeluguStop.com

దీని ద్వారా, యూజర్లు తమ బ్యాంక్ ఖాతాతో వారి అరచేతిని లింక్ చేయవచ్చు.అది ఎలా పనిచేస్తుంది? యూజర్లు ఒక టర్న్‌స్టైల్ లేదా స్కానర్‌పై అరచేతిని స్వైప్ చేస్తే, వీచాట్ వాలెట్ నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది.ఎందుకంటే, ఈ పద్ధతి అరచేతిలోని రక్తనాళాలను స్కాన్ చేస్తుంది.వేలిముద్రల మాదిరిగా కాకుండా, అరచేతి రక్తనాళాల నమూనా జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుంది.

ఈ టెక్నాలజీతో కార్డులు లేదా ఫోన్లతో కుస్తీలు పడాల్సిన అవసరం లేకుండా ఒక్క స్వైప్‌తో చెల్లింపులు చేయవచ్చు.భవిష్యత్తులో, ఈ టెక్నాలజీ షాపింగ్, టికెట్ బుకింగ్, ఇతర చెల్లింపులకు కూడా విస్తరించే అవకాశం ఉంది.ప్రస్తుతం, పామ్ పేమెంట్లు( Weixin Palm Payment ) ప్రధానంగా రవాణా రంగంలోనే వాడుతున్నారు.ఉదాహరణకు దాషింగ్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ వంటి సబ్వేలలో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.

ఇంకెక్కడ వాడే అవకాశం ఉంది? అని అడిగితే భవిష్యత్తులో దుకాణాలు, రెస్టారెంట్లు, ఇతర రకాల చెల్లింపులకు కూడా ఈ టెక్నాలజీ విస్తరించే అవకాశం ఉంది.ఈ టెక్నాలజీకి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.

అయితే కొందరు వినియోగదారులు, ఆకతాయిలు స్కానింగ్ పరికరాలను గీరుతారేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనివల్ల స్కానింగ్ సమస్య అవుతుంది.ఈ టెక్నాలజీ సౌకర్యంగా ఉండేప్పటికీ, బయోమెట్రిక్ డేటా కాబట్టి ప్రైవసీ విషయంలో కొందరికి ఆందోళనలు ఉన్నాయి.కొందరు వినియోగదారులు స్కానింగ్ సమస్యల వల్ల, ట్రెడిషనల్ పద్ధతులైన మెగ్నటిక్ కార్డు( Magnetic card )లను ఉపయోగించడానికే ఇష్టపడతారు.

ఓ వినియోగదారు ఇలా అడిగారు, “నిద్రపోతున్నప్పుడు మన చేతులను ఎక్కడ దాచుకుంటాం?” ఎవరైనా మొబైల్ రీడర్‌తో నిద్రలో ఉన్నప్పుడు మన చేతులను స్వైప్ చేసి డబ్బులు తీసేయొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube