రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల రైతుల వ్యవసాయానికి జీవనాధారమైన సింగసముద్రం కట్ట మైసమ్మ కు అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈనెల 7వ తేదీ ఆదివారం రోజున పండగ నిర్వహించాలని ఆయకట్టు రైతులు నిర్ణయించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామి పురాతన ఆలయంలో ఆయకట్టు రైతులు అందరూ కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఓగ్గు బాలరాజ్ యాదవ్ అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమై మైసమ్మ పండుగా నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు.
నిర్వహణ కమిటీ ప్రతినిధులుగా ఓగ్గు బాలరాజు యాదవ్ , సద్ది లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు గా పారిపెల్లి రామిరెడ్డి , బండారి బాల్ రెడ్డి బయికాడి రాజయ్య , అంతెర్పుల ఎల్లయ్య , మద్దుల బాల్ రెడ్డి , కొత్త మల్లయ్య , రావుల తిరుపతిరెడ్డి ,
గుడి విట్టల్ రెడ్డి, కొన్నె బాలయ్య , దీటి నర్సయ్య, కొన్నె పోచయ్య , నేవూరి బాలయ్య గారి గోపాల్ రెడ్డి, గుండాడి వెంకటరెడ్డి, మెగి నరసయ్యలను నియమించారు.సింగసముద్రం నుండి వచ్చే ప్రధాన కాలువ నుండి చిన్న చిన్న కాలువల ద్వారా వారి పొలాలకు నీటినీ పారించడానికి విఆర్ఏ వ్యవస్థను గత బిఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసినందున ఆయకట్టు రైతులు వేతనాలు నిర్ణయించి నీరటీలను నియమించడం జరిగింది.
ఎకరానా ఆయకట్టు రైతులు 200 రూపాయల చొప్పున పండుగ నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది ఇట్టి డబ్బులను నీరటీలకు చెల్లించాలని చెల్లించని రైతుల వడ్లను వరి కొనుగోలు కేంద్రాలకు వివరాలు పంపి ఎకరానా 200 రూపాయల చొప్పున చెల్లించేదాకా అట్టి రైతుల తూకాలను నిలిపివేయించాలని ఆయకట్టు రైతులు నిర్ణయించారు.
అదేవిధంగా వరి కోత యంత్రాల యజమానులు గ్రామానికోరకంగా రేట్లను వసూలు చేసి రైతులను మోసం చేస్తున్నందున కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నిర్ణయించిన ప్రకారమే వరి కోత యంత్రాల నిర్వాహకులు రైతుల నుంచి డబ్బులు తీసుకోవాలని ఎక్కువ డబ్బు లు తీసుకుంటే వరి కోత యంత్రాల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామని రైతులు తెలిపారు.
ధరలు నిర్ణయించడానికి బుధవారం తేదీ 03-04-2024 ఉదయం 8-30 గంటలకు ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట రైతులందరూ సమావేశం కావాలని ఈ సమావేశానికి ఎల్లారెడ్డిపేట గ్రామ రైతులందరూ హాజర్ కావాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాల్రాజ్ యాదవ్ కోరారు.