నిత్యం ఏదో ఒక విషయంపై తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) , అధికార పార్టీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటూనే ఉంది.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )కి మాజీ మంత్రి , సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఈ రోజు సంచలన లేఖ రాశారు.
ఈ లేఖలో అనేక ప్రజా సమస్యలను ప్రస్తావించారు.తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచిందని, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించిందని, విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసిందని లేఖలో విమర్శలు చేశారు.
నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా, 400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్ కు వెయ్యి, రెండు పేపర్లకు 2000 ఫీజుగా వసూలు చేస్తున్నారు.ఈ ఫీజులు సీబీఎస్సీ( CBSC ) నిర్వహించే సి టెట్ తో పోల్చితే డబల్ గా ఉందని పేర్కొన్నారు .రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకపోవడాన్ని నిరసిస్తూ బిఈడి, డీ.ఎడ్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారు.పుస్తకాలు వదిలి రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు.
అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు.ఇదేనా ఇందిరమ్మ రాజ్యం .ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన, నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోంది.ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలనిబీ బీ ఆర్ఎస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, అయినా స్పందించకపోతే విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున పోరాటం మొదలు పెడతామని లేఖలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీష్ రావు.