ఎన్నికల సమయంలో కాంగ్రెస్( Congress ) పార్టీకి భారీ ఊరట లభించింది.కాంగ్రెస్ ఇన్‌కమ్‌ట్యాక్స్ కేసుపై భారత అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఈ మేరకు పన్ను బకాయిల వసూలు కోసం కాంగ్రెస్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు( Supreme Court ) తెలిపింది.ఈ క్రమంలోనే పన్ను బకాయిల వసూలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.కాంగ్రెస్ రూ.3,500 కోట్లు చెల్లించాలన్న ఐటీ శాఖ ఎన్నికల సమయంలో బకాయిల వసూలుకు ప్రయత్నాలు చేయబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.ఎన్నికల సమయంలో ఏ పార్టీకి ఇబ్బందులు కలిగించాలని అనుకోవడం లేదని పేర్కొంది.అనంతరం తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరింది.