సినిమా, రాజకీయ రంగాల్లో తండ్రిని మించిన కొడుకు అని అనిపించుకోవడం సులువైన విషయం కాదు.అయితే రామ్ చరణ్( Ram Charan ) మాత్రం తండ్రిని మించిన కొడుకు అని ఆయన అభిమానులు భావిస్తారు.
ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో రామ్ చరణ్ కు ఎవరూ సాటిరారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.ఎన్నో గుప్త దానాలు చేసే ఈ హీరో వాటి గురించి ప్రచారం చేసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు.
నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు( Ram Charan Birthday ) వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి.మనోజ్( Manoj ) రామ్ చరణ్ గొప్పదనం గురించి చెబుతూ నేను అమెరికాలో ఉన్న సమయంలో దుబాయ్ లో ( Dubai ) ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉందని ఆ సమయంలో చరణ్ కు ఆ ఆడపిల్ల సమస్య గురించి వివరించి 5 లక్షల రూపాయలు అవసరమని చెప్పగా వెంటనే చరణ్ 5 లక్షల రూపాయల సహాయం చేశాడని ఆ అమ్మాయి అకౌంట్ కు ఆ డబ్బులు పంపాడని మనోజ్ చెప్పారు.
అర్ధరాత్రి సమయంలో చరణ్ ఈ సాయం చేశాడని ఇదీ రామ్ చరణ్ అని మనోజ్ కామెంట్లు చేశారు.
ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే రామ్ చరణ్ అస్సలు తట్టుకోలేడని మనోజ్ కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.అయితే రామ్ చరణ్ మాత్రం తాను చేసిన సహాయం గురించి ఎప్పుడూ చెప్పలేదు.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో( Game Changer Movie ) నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన జరగండి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సాంగ్ ను గ్రాండ్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించారు.
యూట్యూబ్ లో జరగండి సాంగ్ 4 మిలియన్ల వ్యూస్ తో అదరగొడుతోంది.ఫస్ట్ సింగిల్ తో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మొదలు కాగా త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది.రామ్ చరణ్ తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.చరణ్ పారితోషికం పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.