ఈ మధ్యన తెలుగులో ఎందుకో లేడీ డైరెక్షన్ డైరెక్టర్స్ హవా బాగా తగ్గిపోయింది.అడపాదనప నందిని రెడ్డి ( Nandini Reddy )లాంటి ఎవరో ఒకరు ఒక సినిమా తీస్తే తప్ప జనాలకు మన వాళ్ళు ఉన్నారు అన్న విషయం కూడా గుర్తులేదు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే మెయిల్ డామినేషన్ అయితే క్రియేటివిటీకి మెయిల్ డామినేషన్ కి సంబంధం లేదు.మనలో క్రియేటివిటీ ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా తీయడానికి మనకు అవకాశాలు దొరుకుతాయి.
ఇబ్బందులు అయితే ఉండొచ్చు కానీ అవకాశాలు లేవు అని మాత్రం చెప్పడానికి లేదు.కానీ వీటన్నిటికి విరుద్ధంగా తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలామంది లేడీ డైరెక్టర్స్ మెగా ఫోన్ పట్టుకొని సినిమాలను వరుస పెట్టి తీస్తున్నారు.
మరి తమిళనాడులో అలా సినిమాలు తీస్తున్న లేడీ డైరెక్టర్ ఎవరు ? వారు తీసిన వారి బెస్ట్ ఐకాన్ సినిమా ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సుధా కొంగర
( Sudha Kongara )
సుధా 2008 నుంచి దర్శకత్వం చేస్తుండగా తెలుగులోనే మొదట ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది.ఆంధ్ర అందగాడు( Andhra Andagadu movie ) అనే సినిమా తీసిన తర్వాత ద్రోహి అనే తమిళ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత తమిళ్ మరియు హిందీ భాషలో మాధవన్ మెయిన్ లీడ్ గా రితిక సింగ్ తో కలిసి బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా తీసింది.
దానినే తెలుగులో గురు పేరుతో వెంకటేష్ తో మళ్లీ రీమేక్ చేసింది.ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు తీసిన ఆమె కెరియర్ లో సూరారై పొట్రు అనే సినిమా ఖచ్చితంగా ఒక ఐకానిక్ మూవీ.
సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ్ భాష పై ఎక్కువగా ఫోకస్ చేసింది.చివరగా ఆమె 2024 లో సర్ఫిరా అనే ఒక సినిమా తీయగా ఇప్పుడు తమిళ్లో మరో చిత్రాన్ని తీస్తోంది.
మధుమిత
( Madhumita )
మధుమిత ఇండోనేషియా లో పుట్టి సింగపూర్ లో పెరిగింది తర్వాత లాస్ ఏంజెల్స్ లో తన చదువులు పూర్తి చేసింది.తను సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్న తర్వాత అనేక షార్ట్ ఫిలిమ్స్ తీసి బీబీసీ నుంచి బెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కేటగిరి అవార్డు అందుకుంది.పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ టీం తో కూడా పని చేసింది.
అలా 2008లో వాళ్లమై తరయో అనే సినిమాతో డైరెక్షన్ చేయగా ఆమె తీసిన కేడీ సినిమా ఖచ్చితంగా ఒక ఐకానిక్ మూవీ.ఇక చివరగా 2022లో తీసిన పుత్తం పుదు కాలయి విడియాదా అనే చిత్రం మధుమిత డైరెక్షన్ ఖచ్చితంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు.
గాయత్రి
( Gayatri )
సుధా మరియు మధుమతి లాగానే 2007లోనే గాయత్రి కూడా దర్శకత్వంలోకి వచ్చింది.ఆమె మొదటి తీసిన సినిమా ఓరం పో.ఇక 2022లో హిందీలో ఆమె తీసిన విక్రమ్ వేదం సినిమా ఒక ఐకాన్ మూవీ.ఇందులో సైఫ్ అలీ ఖాన్ తో పాటు హ్రితిక్ రోషన్ కూడా నటించారు.
ఈ సినిమా గాయత్రి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అలాగే గాయత్రి ఎక్కువగా ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లో ప్రస్తుతం సినిమాలు తీస్తున్నారు.
హలిత షమీమ్
( Halita Shamim )
తమిళంలోనే తన కెరియర్ కొనసాగిస్తున్న హలిత సైతం 2014లో పూవరసం పీపీ అనే సినిమాతో డైరెక్టర్ గా మారింది.ఆమె తీసిన సిల్లు కరుపట్టి సినిమా( Sillu Karupatti movie ) ఒక అద్భుతమైన చిత్రం.ఆమె కెరియర్ లో ఇది ఒక ఐకానిక్ చిత్రం.
ఇక ఆమె చివరిగా 2023లో మిన్మిని అనే సినిమా తీయగా అది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.