నిమ్మ తోట( Lemon Cultivation )లను సాగు చేసే రైతులు ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించాలంటే.పూత, పిందె దశలో సరైన యాజమాన్య పద్ధతులను క్రమం తప్పకుండా పాటించాలి.
నిమ్మ మొక్క( Lemon Plant ) కు సంవత్సరం పొడవునా పూత వస్తూనే ఉంటుంది.మొత్తం పూతను నిలపడం వల్ల దిగుబడి ఆశాజనకంగా ఉండదు.
సంవత్సరంలో కేవలం ఒక్క సీజన్లో మాత్రమే పూతను నిలపాలి.జనవరి-ఫిబ్రవరిలో నిమ్మ మొక్కలకు అధిక పూత రావాలంటే.
నవంబర్-డిసెంబర్ నెలలో మొక్కలను నీటి ఎద్దడికి గురి చేయాలి.అంటే డిసెంబర్ నెలలో మొక్కలకు నీటి తడులను ఆపేస్తే మొక్కలు నీటి ఎద్దడికి గురై ఆకులన్నీ రాలిపోతాయి.
డిసెంబర్ నెల చివరి వారంలో మొక్కల చుట్టూ పాదులు తీసి పోషక ఎరువులు వేసి, నీటి తడులు అందించాలి.అప్పుడు మొక్కకు పూత వస్తుంది.
నిమ్మ తోటలలో పూత, పిందే, లేత కాయలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వాతావరణంలో హఠాత్తుగా మార్పులు జరిగితే, చెట్లల్లో రసాయనిక మార్పులు జరిగితే పూత, పిందే రావడం జరుగుతుంది.కాబట్టి నిమ్మ చెట్లు పూత, పిందె( Lemon Groves ) దశలో ఉన్నప్పుడు మొక్క చుట్టూ తవ్వడం చేయకూడదు.నిమ్మ తోటల్లో దున్నడం చేయకూడదు.నిమ్మ చెట్లకు పూత వచ్చిన తర్వాత నీటి కొరత లేకుండా నీరు అందించాలి.
నిమ్మ తోట పూత దశలో ఉన్నప్పుడు ఒక మిల్లీ లీటరు ష్లోనోఫిక్స్ ను 4.5 లీటర్ల నీటిలో కలిపి పూత మొత్తం తడిచేటట్లు పిచికారి చేయాలి.పిందె దశలో ఉన్నప్పుడు 10 పి.పి.యం.2,4-డి ఒక గ్రాము ను 100 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.కోతకు రెండు నెలల ముందు పిచికారి చేయాలి.
ఇక నిమ్మ చెట్ల చుట్టూ కలుపు మొక్కలు( Weeds ) పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.సంవత్సరంలో ఒక్క సీజన్లో మాత్రమే పూతను నిలుపుకుంటే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడును పొందవచ్చు.