మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.సినిమా సినిమాకు వైవిధ్యం చూపించడంతో పాటు కెరీర్ పరంగా సంచలనాలను సృష్టించారు.
మిరపకాయ్ సినిమా వరకు చూసిన రవితేజ( Ravi Teja ) వేరని ఇప్పుడు రవితేజ వేరని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.మాస్ మహారాజ్( Mass Maharaj ) సినిమాల్లో ఆయన మార్క్ మిస్ అవుతోందని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మిరపకాయ్ సినిమా( Mirapakay Movie ) వరకు రవితేజ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఉండేవని ఇప్పుడు మాత్రం రవితేజ సినిమాలు( Ravi Teja Movies ) ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఒక సినిమాను మించి మరో సినిమా తమను నిరాశకు గురి చేస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
రవితేజ సినిమాలు అంటే ఆయన మార్క్ కామెడీ ఆశిస్తామని అయితే ప్రస్తుతం రవితేజ సినిమాలలో అదే మిస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రవితేజ రెమ్యునరేషన్( Ravi Teja Remuneration ) ప్రస్తుతం 25 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఆయన సినిమాలలో చాలా సినిమాలు కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ కావడం లేదు.తన బలాలను రవితేజ విస్మరిస్తున్నాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మాస్ మహారాజ్ ఈ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
బ్యాగ్రౌండ్ లేకుండా రవితేజ ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.

రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) సినిమాలో నటిస్తున్నారు.రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.హరీష్ శంకర్ షాక్, మిరపకాయ్ సినిమాల తర్వాత రవితేజతో తీస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమాతో రవితేజకు పూర్వ వైభవం వస్తుందేమో చూడాల్సి ఉంది.
మాస్ మహారాజ్ రవితేజ రేంజ్ వేరని ఆయన స్థాయికి తగ్గ సినిమాలు రావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.